
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే మొన్నామధ్య విడుదలైన ఆయా షేర్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ను షేక్ చేసింది ఈ సాంగ్. ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సాంగ్. కాగా తాజగా ప్యారడైజ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఎప్పటి నుంచో ఈ సినిమాలో తెలంగాణ పాపులర్ సాంగ్ ఏష నాగుల కట్ట మీద అనే సాంగ్ ఉంటుందని ప్రచారం జరిగింది.
ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే
అనుకున్నట్టే అదే సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. తాజాగా డల్లాస్ లో ఈ సినిమా సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. అనిరుద్ ఈ సాంగ్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తుంది. అలాగే ఈ సాంగ్ లో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సాంగ్ థియేటర్స్ లో షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
అలాగే ఈ పాట కోసం హైదరాబాద్ లో అత్యంత భారీ ఖర్చుతో ఒక ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేశారని.. సాంగ్ మొత్తం అక్కడే పూర్తి చేస్తారని సమాచారం. సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేయనున్నారని.. ఈ పాట థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అంటుంది చిత్రయూనిట్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
ప్యారడైజ్ సాంగ్
Dishti anthaaa povaleeeeee
Naatu masssss #Yeshanagula madness takes over all overrrr pic.twitter.com/HuIVNNF1yR
— THE PARADISE (@TheParadiseOffl) August 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సాంగ్
