Reading Time: < 1 minute

చెన్నై పుళల్ సెంట్రల్ జైలులో సీఎం విజయ్… ఆకస్మిక తనిఖీ..

Caption of Image.

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలనలో తనదైన మార్క్ వేసే దిశగా అడుగులేస్తున్నారు విజయ్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న విజయ్ శుక్రవారం ( ఆగస్టు 29 ) చెన్నైలోని రెడ్ హిల్స్ దగ్గర ఉన్న పుళల్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. జైలులో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విజయ్ జైలులో ఖైదీల పరిస్థితి, సౌకర్యాలను సమీక్షించారు.

ఖైదీలకు అందిస్తున్న ఆహార నాణ్యత, వంటగది నిర్వహణ, వైద్య సదుపాయాలను పరిశీలించారు సీఎం విజయ్. జైలులోని వృత్తివిద్యా శిక్షణా కేంద్రంలో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను సమీక్షించారు విజయ్. వాటిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఇనుప రాక్‌లు, కాగితపు కవర్లు, ఆఫీస్ ఫైల్ బోర్డులు వంటి వస్తువులు ఉన్నాయి. చేనేత, కుట్టుపని విభాగాలలో తయారైన ఉత్పత్తులను తనిఖీ చేశారు విజయ్.

అనంతరం గంట పాటు జైలు ప్రాంగణాన్ని పరిశీలించిన విజయ్ ఆ తర్వాత మూడు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. అక్కడ రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో సీఎం విజయ్ ని చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు జనం.
 

©️ VIL Media Pvt Ltd.