Reading Time: < 1 minute
Mahendragiri Varahi Trailer Launch Sumanth Reveals Siddhu Jonnalagadda Cameo

‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి హిట్ తర్వాత హీరో సుమంత్, డైరెక్టర్ సంతోష్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వేదికపై హీరో సుమంత్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమాలో క్రేజీ యూత్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు! ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని చిత్ర బృందం, నేరుగా ట్రైలర్‌లోనే రివీల్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లాంచ్‌లో సుమంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మా డీజే టిల్లు ఉన్నాడని మీరెవరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. తను చాలా కీలకమైన పాత్ర పోషించాడు.

ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ సంతోష్ దాదాపు మూడేళ్లు ట్రావెల్ అయ్యాం. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కాల్సిన సినిమా కావడంతో సరైన నిర్మాతల కోసం వెయిట్ చేశాం. మా నిర్మాతలు మధు, లక్ష్మణ్ గారు మా వెన్నంటే ఉండి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు” అని చెప్పుకొచ్చారు. తాను చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తినని, కానీ ఈ సినిమాపై తనకు వంద శాతం బలమైన నమ్మకం ఉందని సెప్టెంబర్ 11న థియేటర్లలో మీరే ఆ రిజల్ట్ చూస్తారని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిపై సుమంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథన్ సన్స్’ చిత్రం ఫస్ట్ హాఫ్ రైటింగ్ పరంగా ఒక టెక్స్ట్ బుక్ లాంటిదని, గత పదేళ్లలో ఆ జానర్లో తాను చూసిన టాప్ 10 సినిమాల్లో అదొకటని కొనియాడారు. మొత్తానికి సుమంత్ అపారమైన నమ్మకానికి తోడు.. డీజే టిల్లు క్రేజ్ కూడా యాడ్ అవ్వడంతో సెప్టెంబర్ 11న థియేటర్లలో ‘మహేంద్రగిరి వారాహి’ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాస్ట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది!