
Sun Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. సెప్టెంబర్‌లో గ్రహ రాజు సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. సెప్టెంబర్ 17, 2026న సూర్యుడు సింహ రాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్య రాశి సూర్యుడికి మిత్ర రాశి కావడంతో ఈ సంచారం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
మేష రాశి
సూర్యుడి కన్యా రాశి సంచారం మేష రాశి వారికి అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి కనిపించే అవకాశముంది. ఉద్యోగంలో మీ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా కూడా గతంతో పోలిస్తే ఉపశమనం లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్యుడు ధన స్థానానికి అధిపతిగా ఉండి మూడో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం, కుటుంబం వంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. భవిష్యత్తులో ఈ పరిచయాలు ప్రయోజనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మంచి ఫలితాలు దక్కే అవకాశముంది. అలాగే ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రవి గోచారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశికి సూర్యుడు భాగ్య స్థానానికి అధిపతిగా ఉండి పదో స్థానమైన కర్మ స్థానంలో సంచరించనున్నాడు. దీంతో మీ కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులకు మంచి సమయం. కొత్త డీల్స్ కుదరడంతో పాటు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు తమ రంగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ పేరు, ప్రతిష్ఠ పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కీలకం
గమనిక: ఈ రాశిఫలాలు, జ్యోతిష్య అంచనాలు సాధారణ గ్రహస్థితులు మరియు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడుతున్నాయి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.