Reading Time: 2 minutes
Andhra Pradesh: పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. వాట్సప్‌లో క్షణాల్లోనే అన్నీ సేవలు.. ఏ ప్రభుత్వ ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు..

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. మొబైల్ ద్వారానే సదరం సర్టిఫికేట్‌కు అప్లై చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్నవారితో పాటు ఇతరులు పింఛన్ పొందాలంటే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. అంగవైకల్యం ఉన్నట్లు నిర్ధారించేందుకు ఈ సర్టిఫికేట్ అవసరం. ఇప్పటివరకు ఈ సర్టిఫికేట్ పొందాలంటే స్లాట్ బుకింగ్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు. వాట్సప్ ద్వారా సదరం సర్టిపఫికేట్లు సులువుగా పొందవచ్చు. స్లాట్ అవైలబులిటీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ డౌన్ లోడ్ వంటి సేవలన్నీ వాట్సప్‌లోనే పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వాట్సప్‌లో సేవలు పొందేలా అవకాశం కల్పిస్తోంది.

వాట్సప్‌లో సదరం సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో వాట్సప్‌లోనే ప్రభుత్వ సేవలన్నీ పొందవచ్చు. ఈ మేరకు మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే దీని ద్వారా అనేక సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ల సేవలను కూడా ఇందులో ప్రవేశపెట్టింది. ఇక నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సదరం సర్టిఫికేట్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మెడికల్ టెస్టులు పూర్తయిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఆధారంగా సర్టిఫికేట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల అంగవైకల్యం ఉన్నవారు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే వాట్సప్ ద్వారా అన్నీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంగవైకల్యం ఉన్నవారికి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సౌకర్యం పొందాలన్నా సదరం సర్టిఫికేట్ అనేది అవసరం. దీంతో ఈసర్టిఫికేట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.

ఆన్‌లైన్‌లో సదరం సర్టిఫికేట్ స్లాటు బుకింగ్ ఎలా..?

-9552900009 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయండి

-ఆ తర్వాత సిటిజన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి

-అక్కడ సదరం సర్వీస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-సదరం స్లాట్ అవైలబులిటీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌లలో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోండి

-స్లాట్ అవైలబులిటీ తెలుసుకునేందుకు ఆ ఆప్షన్ ఎంచుకోండి

-స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు సదరం స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోండి

-సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు సదరం సర్టిఫికేట్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోండి