
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా ప్రారంభం కానున్న ఆసియా క్రీడల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి క్రీడాలకి ఆతిథ్యమిస్తున్న జపాన్, క్రికెట్ మ్యాచ్‌ల కోసం కనీస వసతులు కూడా కల్పించకపోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మైదానంలో టెంట్లను డ్రెస్సింగ్ రూమ్‌లుగా ఏర్పాటు చేయడం, టాయిలెట్లను ఏకంగాహాఫ్ కిలోమీటరు (500 మీటర్లు) దూరంలో ఏర్పాటు చేయడం, ఇరుకు హోటల్ గదుల సదుపాయాలు కల్పించడంపై క్రీడా వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
బీ టీమ్ పంపుతామని వార్నింగ్:
గతంలో చైనాలోని హ్యాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో స్వర్ణాలు సాధించిన భారత్, ఈసారి కూడా పతకాలను నిలబెట్టుకునేందుకు బలమైన జట్లను ప్రకటించింది. పురుషుల జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ లాంటి అగ్రశ్రేణి స్టార్లను ఎంపిక చేయగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మలతో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను రెడీ చేసింది. అయితే జపాన్‌లో కల్పించిన అధ్వానమైన పరిస్థితులపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) తీవ్ర అసంతృప్తి చెందాయి. అక్కడకు ఒక పరిశీలకుడిని పంపి, వసతులు తగిన రీతిలో లేకపోతే ప్రధాన ఆటగాళ్లను తప్పించి, కేవలం బీ (B) టీమ్‌ను మాత్రమే పంపాలని బీసీసీఐ యోచిస్తోంది.
ఆసియా క్రీడల స్థాయికే ముప్పు తెస్తున్న నిర్వాహకుల తీరు:
అంతర్జాతీయ మ్యాచ్‌లకు సాధారణ గల్లీ క్రికెట్ టోర్నీల కంటే ఘోరమైన వసతులు కల్పించడం ఆసియా క్రీడల కీర్తి ప్రతిష్ఠలను మసకబార్చేలా ఉంది. జపాన్ ఒలింపిక్ అధికారుల తీరు క్రికెట్‌ను కనీసం క్రీడగా పరిగణించడం లేదనే భావన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ తమ ఆటగాళ్ల సౌకర్యాలు, రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించడం సరైనదే అయినప్పటికీ.. నిర్వాహకుల అలసత్వం కారణంగా ప్రధాన భారత జట్టు టోర్నీకి దూరమయ్యే పరిస్థితి రావడం ఆసియా క్రీడల పోటీతత్వాన్ని, నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవైపు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే ప్రయత్నాలు జరుగుతుంటే, ఇలాంటి అరకొర ఏర్పాట్లు క్రీడా రంగానికి ఏమాత్రం మంచిది కాదని క్రీడాపండితులు పేర్కొంటున్నారు.
India name full squads for Asian Games 2026 🏏🇮🇳
Both the men’s and women’s cricket teams are set for Aichi-Nagoya this September.
Shreyas Iyer will lead the men’s side, with Tilak Varma as his deputy and Jasprit Bumrah back in the mix. Young gun Vaibhav Sooryavanshi also finds… pic.twitter.com/HEjswA3Quy
— The Bridge (@the_bridge_in) August 26, 2026