
Vivo Y31t 5G: భారత్‌లో వివో (vivo) నుండి Y సిరీస్‌లో భాగంగా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo Y31t 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, 7,200mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు IP68, IP69 రేటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. బలమైన బిల్డ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్:
పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో 2.2GHz వరకు క్లాక్ స్పీడ్‌తో రెండు A78 ఆధారిత కోర్లు, 2GHz వరకు పనిచేసే ఆరు A55 ఆధారిత కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 613 GPU అందించారు. 4GB, 6GB LPDDR4X RAM వేరియంట్లలో ఫోన్ లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB, 256GB ఆప్షన్లు ఉన్నాయి.
కెమెరా & బ్యాటరీ:
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో f/2.0 అపెర్చర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.4 అపెర్చర్‌తో 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. LED ఫ్లాష్ కూడా అందించారు. కెమెరాలో నైట్, పోర్ట్రెయిట్, ప్రో, డాక్యుమెంట్ స్కానింగ్, 50MP హై-రిజల్యూషన్ క్యాప్చర్‌తో పాటు అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ వంటి మోడ్‌లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందించారు.
మొబైల్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 7,200mAh బ్యాటరీ. దీనికి 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. వినియోగాన్ని బట్టి పవర్ ఇన్‌పుట్‌ను డైనమిక్‌గా నియంత్రించే విధంగా ఛార్జింగ్ వ్యవస్థను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
డిస్‌ప్లే & IP69 రేటింగ్:
vivo Y31t 5Gలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు. ఇది 1608 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 1,250 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్, గేమింగ్ వంటి పనుల్లో స్మూత్ విజువల్ అనుభూతి లభిస్తుంది. ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ అందించారు. ఇవి దుమ్ము, నీటిలో మునిగిపోవడం, అధిక పీడనం మరియు అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీటి జెట్ల నుంచి రక్షణను అందిస్తాయి. అదనంగా SGS గోల్డ్ లేబిల్ ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టన్స్, మిలిటరీ గ్రేడ్ దురాబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఫోన్‌లో తేమ గుర్తింపు, వన్ టాప్ వాటర్ అండ్ డస్ట్ ఎజెక్షన్ ఫీచర్లు కూడా అందించారు.

ధర:
ఈ మొబైల్ లో సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో AI క్రియేషన్, ఆరిజిన్ ఐలాండ్, డ్రాగ్ & గో, ప్రైవేట్ స్పేస్, వివో DocMaster వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. ఈ ఫోన్ క్రిమ్సన్ రెడ్, సిషోర్ గ్రీన్, గోల్డెన్ మిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా భారత్‌లో vivo Y31t 5G మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు ఇలా ఉన్నాయి..
* 4GB + 128GB: రూ.25,999
* 6GB + 128GB: రూ.29,999
* 6GB + 256GB: రూ.34,999
ఆగస్టు 31 వరకు కొనుగోలు చేసే కస్టమర్లకు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. SBI కార్డు, HDFC బ్యాంకు, Axis బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు, ఎస్ బ్యాంకు, BOB కార్డు, ఇందూసింద్ బ్యాంకు తదితర బ్యాంకుల కార్డులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా 10 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ సదుపాయం, జియో ద్వారా ఆరు నెలల పాటు 10 OTT యాప్స్ బండిల్, V-షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ వంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.