
Friday Horoscope August 28 2026: తులా రాశి వారు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారంలో ఆదాయాలు పెరిగి కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారు ఉన్నత విద్య కోసం దూర ప్రయాణాలు చేస్తారు. పెద్దల ప్రోత్సాహం, సహకారం మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అచ్యుతాష్టక పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి సామాజిక హోదా, గౌరవాలు పెరుగుతాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుస్తారు. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 28 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.