Reading Time: 2 minutes
Ravi Teja: ఇరుముడి ఈవెంట్‏లో రవితేజ తాగిన వాటర్ ఇదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటుడు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ నటించిన ఇరుముడి సినిమా మేనియా నడుస్తుంది. అయితే అటు సోషల్ మీడియాలో మాత్రం ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో రవితేజ తాగిన వాటర్ బాటిల్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఆ బాటిల్‌లో ఉన్నది ఏమిటి అనే చర్చ సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య తీవ్రంగా జరిగింది. తాజాగా ఈ వాటర్ గురించి ఇరుముడి నటుడు లోకేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడు రవితేజ అద్భుతమైన ఎనర్జీ, ఫిట్‌నెస్‌ వెనుక దాగి ఉన్న రహస్యం ఇప్పుడు బయటపడింది. ఈ ప్రత్యేక వాటర్ సాధారణ నీరు కాదు. ఇది దోసకాయ (కుకుంబర్), నిమ్మకాయ (లెమన్), అల్లం (జింజర్) , తులసి ఆకులతో (బేసిల్ లీవ్స్) కూడిన ఒక హైడ్రేటింగ్ డ్రింక్. ఈ పదార్థాలను నీటిలో నానబెట్టి, ఆ పానీయాన్ని రవితేజ గారు క్రమం తప్పకుండా తీసుకొంటున్నారని తెలిపారు. ఈ మిశ్రమం శరీరానికి అద్భుతమైన హైడ్రేషన్‌ను అందించి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుందట.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

మాస్ మహారాజ్ రవితేజ గారి అంతులేని ఉత్సాహానికి, ఫిట్‌నెస్‌కు ఈ పానీయం ఒక ముఖ్య కారణం. ఈ ఆరోగ్యకరమైన పానీయం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ డ్రింక్ గురించి ఆత్రం అనే వ్యక్తి గతంలోనే వివరించడం గమనార్హం. సాధారణ ప్రజలు కూడా ఈ పానీయాన్ని తయారుచేసుకొని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రవితేజ గారి ఆరోగ్య రహస్యం బయటపడటంతో, ఆయన అభిమానులు ఈ ప్రత్యేక పానీయాన్ని ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

రోజువారీ జీవితంలో సాధారణ నీటికి బదులుగా ఇలాంటి డిటాక్స్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రవితేజ లాంటి ఫిట్‌నెస్ సీక్రెట్‌ను పాటించాలనుకునేవారు ఈ సహజమైన డ్రింక్‌ను తమ డైట్‌లో భాగం చేసుకోవచ్చు!

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..