Reading Time: < 1 minute
Forbes India 2026 Allu Arjun Cover 100 Biggest Celebrities

Forbes India: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. Forbes India 2026లో ప్రకటించిన ‘100 Biggest Celebrities’ ప్రత్యేక సంచిక కవర్‌పై అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. సినిమాలతో పాటు ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్, బాక్సాఫీస్ ప్రభావం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాపులారిటీకి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ స్టార్‌డమ్ కొత్త స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ‘పుష్ప 2: ది రూల్’ సాధించిన భారీ విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో అల్లు అర్జున్‌కు ఏర్పడిన ఫాలోయింగ్ ఆయనను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది.

అయితే అల్లు అర్జున్ ప్రభావం ఇప్పుడు సినిమాలకే పరిమితం కావడం లేదు. ఆయన స్టైల్, డ్యాన్స్, మేనరిజమ్స్, సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులపై చూపిస్తున్న ప్రభావం తెర దాటి కూడా కొనసాగుతోంది. దీంతో దేశంలోని ప్రముఖ బ్రాండ్లు సైతం అల్లు అర్జున్‌ను తమ ప్రచారాల్లో భాగం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బాక్సాఫీస్ సక్సెస్‌తో పాటు బలమైన బ్రాండ్ విలువను సొంతం చేసుకున్న భారతీయ నటుల్లో అల్లు అర్జున్ ఒకరిగా ఎదిగారని ఫోర్బ్స్ ఇండియా కథనం పేర్కొంది. ప్రేక్షకులతో బలమైన కనెక్షన్, భారీ అభిమానగణం, కమర్షియల్ ఇమేజ్.. ఇవన్నీ కలిసి ఆయనను అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీల జాబితాలో నిలబెడుతున్నాయని పేర్కొంది. ఇక ‘Forbes India’ కవర్‌పై అల్లు అర్జున్ కనిపించడం భారతీయ సినీ తారల ప్రభావం మారుతున్న తీరుకు ప్రతీకగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో స్టార్‌డమ్‌ను సినిమాల వసూళ్లతో మాత్రమే అంచనా వేసేవారు. ఇప్పుడు కల్చరల్ ఇంపాక్ట్, బ్రాండ్ పవర్, ఆడియన్స్ లాయల్టీ, కమర్షియల్ విలువ కూడా కీలకంగా మారాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల స్టార్‌గా మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం.. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయికి, ఇప్పుడు జాతీయ సెలబ్రిటీ బ్రాండ్ స్థాయికి చేరుకుంది. సినిమాలకంటే పెద్దదిగా ‘బ్రాండ్ AA’ ఎదుగుతోందనడానికి Forbes India కవర్ మరో ఉదాహరణగా నిలిచిందని బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.