Reading Time: < 1 minute
Satyadevs Psychological Thriller Rao Bahadur To Stream On Netflix From July 31

Rao Bahadur OTT: థియేటర్లలో ఉత్కంఠమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావ్ బహదూర్’. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటుడు సత్యదేవ్, రచయిత దర్శకుడు వెంకటేష్ మహాల మరోసారి కలిసి రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సినీ అభిమానుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. నిర్మాతలు ‘రావ్ బహదూర్’ 2026 జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాకుండా, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఈ మూవీని తమ మాతృభాషలో చూసే అవకాశం పొందనున్నారు ఓటీటీ ఆడియన్స్.

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించకపోయినా, కథనం, దర్శకత్వం, సత్యదేవ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కథలోని సైకలాజికల్ ట్విస్టులు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో విడుదల తర్వాత కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాపై చర్చ కొనసాగడం, ఓటీటీ విడుదలపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటించారు. అలాగే వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ మూవీని చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ సంయుక్తంగా నిర్మించగా, స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో థియేటర్లలో మంచి స్పందన పొందిన ‘రావ్ బహదూర్’ ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద ప్రేక్షకాదరణ పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు భాషల్లో విడుదల కావడం వల్ల ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.