July 20, 2026

స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..

స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..
Reading Time: 2 minutes
స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..

హిందూ సంప్రదాయంలో పవిత్రతకు, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పూజా కార్యక్రమాలే కాదు, నిత్య జీవితంలో చేసే ప్రతి పనికి ఒక నియమం ఉంటుంది. ఈ క్రమంలోనే ఉదయాన్నే స్నానం చేయకుండా వంటిట్లోకి ప్రవేశించడం, వంట చేయడం అశుభమని వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు పెరగడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేయకుండా వంట చేయడం వల్ల జరిగే నష్టాలు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

స్నానం చేయకుండా వంట చేస్తే వచ్చే సమస్యలు

అన్నపూర్ణా దేవి అనుగ్రహం లభించదు: హిందూ ధర్మం ప్రకారం.. ఇంటి వంటగది సాక్షాత్తూ ఆ అన్నపూర్ణా దేవి నివసించే పవిత్రమైన స్థలం. దైవ సమానమైన వంటగదిలోకి స్నానం చేయకుండా, అపవిత్రంగా వెళ్లడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దేవతలు సైతం స్నానం చేయకుండా వండిన ఆహారాన్ని స్వీకరించరని నమ్ముతారు.

రాహు-కేతు గ్రహ దోషాలు పెరుగుతాయి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే శుద్ధి లేకుండా, నియమాలను పాటించకుండా ఆహారాన్ని వండటం వల్ల జాతకంలో రాహు, కేతువుల అశుభ ప్రభావం పెరుగుతుంది. ఇది ఇంట్లో ఆకస్మిక సమస్యలకు, ధన నష్టానికి దారితీస్తుంది.

ఆహారం తామసికంగా మారుతుంది: శాస్త్రాల ప్రకారం.. స్నానం చేయకుండా వండిన, తిన్న ఆహారం తామసిక ఆహారంగా మారుతుంది. ఇటువంటి భోజనం చేయడం వల్ల మనుషులలో కోపం, బద్ధకం, ప్రతికూల ఆలోచనలు, మానసిక అశాంతి పెరుగుతాయి.

శారీరక, మానసిక అనారోగ్యాల ముప్పు: ఉదయాన్నే నిద్రలేవగానే శరీరంలో బ్యాక్టీరియా, చెమట వంటి కంటికి కనిపించని అశుద్ధాలు ఉంటాయి. స్నానం చేయకుండా వంట చేయడం వల్ల ఆహారం కలుషితమై, అది తినే కుటుంబ సభ్యులలో ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి, దీర్ఘకాలిక శారీరక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇంట్లో ప్రతికూల శక్తి: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉదయం స్నానం చేసి వంటగదిలోకి వెళ్లడం వల్ల వంటింట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అదే అపవిత్రంగా వంట చేస్తే ఆ ప్రతికూల శక్తి వండిన పదార్థాల ద్వారా కుటుంబం మొత్తానికి వ్యాపించి, ఇంట్లో కలహాలు వచ్చేలా చేస్తుంది.

వంటింట్లో పాటించాల్సిన మరికొన్ని ముఖ్యమైన నియమాలు..

మొదటి నైవేద్యం అగ్నిదేవుడికి: వంట పూర్తయిన తర్వాత మొదటి రోటీ లేదా కొద్దిగా అన్నాన్ని అగ్నిదేవుడికి లేదా గోమాతకు కృతజ్ఞతగా సమర్పించడం శుభప్రదం.

కడిగిన పాత్రల వాడకం: రాత్రి వేళల్లో వంటింటిని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే పాత్రలను మరోసారి కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించాలి.

పాజిటివ్ మైండ్: వంట చేసేటప్పుడు కోపంగా, చిరాకుగా ఉండకూడదు. ప్రశాంతమైన మనసుతో భగవన్నామ స్మరణ చేస్తూ వండిన ఆహారం అమృతంగా మారుతుంది.

మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక గూఢమైన శాస్త్రీయ, ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. ఉదయాన్నే స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో, శరీరంతో వంట చేయడం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు పూర్తిగా హిందూ సాంప్రదాయాలు, వాస్తు శాస్త్ర నిపుణుల నమ్మకాల ఆధారంగా అందించడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ధృవీకరణలు లేవు. దీనిని కేవలం ఒక అవగాహనగా మాత్రమే గమనించగలరు.