
పెట్రోల్ అవసరం లేకుండా, పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారును వచ్చేస్తోంది. లీటరు పెట్రోల్ కేవలం రూ. 25 లు అయ్యే ఖర్చుకు సమానంగా ఈ కారు నిర్వహణ ఖర్చు ఉండనుంది. ఇథనాల్ పెట్రోల్ ను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్లను తీసుకొస్తున్నారు. పెట్రోల్‌కు బదులుగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు.
ప్రపంచంలోనే మొదటి BS-VI సెకండ్ స్టేజ్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును టయోటా కంపెనీ అభివృద్ధి చేసింది. కంపెనీ తయారు చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ 100శాతం ఇథనాల్‌తో నడవడమే కాకుండా, స్వయంగా 60శాతం విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది.
ఇథనాల్ ధర పెట్రోల్ కంటే చాలా తక్కువ. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కారు రన్నింగ్ కాస్ట్ లీటరుకు రూ. 25 లీటర్ పెట్రోల్ మైలేజ్ ఖర్చుతో సమానం అవుతుందని అంచనా.
ఇథనాల్ పెట్రోల్ చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారుచేసే బయోఫ్యూయెల్. ఇది పెట్రోల్ కంటే చాలా తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుండటంతో కాబట్టి కాలుష్యం భారీగా తగ్గుతుందని నిపుణులుచెబుతున్నారు.
►ALSO READ | SIR నోటీసుల టెన్షన్ వద్దు.. ఓటర్ల ఇళ్లకే BLOలు.. ఈసీ కీలక ప్రకటన
E20 పెట్రోల్ తో వాహన ఇంజిన్లపై ప్రభావం పడుతుందని ఇటీవల పార్లమెంటులో , సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వ E20 ఇథనాల్ మిశ్రమా విధానంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ కేంద్ర మంత్రి గడ్కరీ.. వచ్చే నెలలో ఈ టయోటా ఇన్నోవా ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తాను ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు ఇథనాల్ పెట్రోల్ ను ఉపయోగిస్తున్నాయని మంత్రి అన్నారు. మన దేశంలో కూడా E20 పెట్రోల్ తో ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. 100 శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే టయోటా ఇన్నోవా కారు ఆవిష్కరణ శుభపరిణామన్నారు మంత్రి గడ్కరీ.