Reading Time: 2 minutes

Weekend OTT Watchlist: ఓటీటీలో సస్పెన్స్, కామెడీ విందు.. ఈ వీకెండ్ ఏ సినిమా ఎక్కడ చూడాలంటే?

Caption of Image.

సినీ ప్రియులకు ఈ వీకెండ్ వినోదాల విందు సిద్ధమైంది. పెద్ద సినిమాల థియేట్రికల్ రన్‌లు ముగియడం, సరికొత్త డిజిటల్ కంటెంట్ రంగంలోకి దిగడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లన్నీ సరికొత్త సినిమాలు, మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్‌లతో సందడి చేస్తున్నాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా నుంచి డివోషనల్ మిస్టరీల వరకు ప్రతి ఒక్కరికీ కావాల్సిన కంటెంట్ సిద్ధంగా ఉంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో:

అల్లరి నరేశ్ నవ్వించే మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పుడు ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చంద్రమోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సురభి, రాశిసింగ్ నటన ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ‘మేన్షన్ హౌస్ మల్లేష్’, హాలీవుడ్ అడాప్షన్ ‘ది లవ్ హైపోథెసిస్’, తమిళ చిత్రం ‘ఫొటోగ్రాఫర్’, హిందీ డబ్బింగ్ ఫన్ రైడ్ ‘డోంట్ బి షై’ అందుబాటులోకి వచ్చాయి. రెంట్ ప్రాసెస్‌లో ‘ది డెత్ ఆఫ్ రాబిన్‌హుడ్’ అలరిస్తోంది.

 

జీ5 (ZEE5):

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఆధ్యాత్మిక మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ జీ5లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. దీనితో పాటు కవిన్, నయనతార, సుహాసిని కాంబోలో వచ్చిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలాగే హిందీ బోల్డ్ సిరీస్ ‘బకైతి 2’ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

హ్యూమా ఖురేషీ లేడీ ఓరియంటెడ్ డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బేబీ డూ ఆర్ డై’ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. సస్పెన్స్ క్రైమ్ డ్రామా ‘షక్ : ట్రస్ట్ నో వన్’ (తెలుగు డబ్బింగ్), మిస్టరీ మూవీ ‘యునాబాంబర్’ ,  హాలీవుడ్ క్లాసిక్ ‘వోంకాస్ ది గోల్డెన్ టికెట్’ ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్స్.

 

జియో హాట్‌స్టార్ :

హాట్‌స్టార్‌లో మల్టీ లాంగ్వేజ్ యాక్షన్ డ్రామా సిరీస్ ‘హుంకార్ : ది రోర్’, కన్నడ హిట్ ‘మాంగో పచ్చ’, హాలీవుడ్ క్రేజీ యానిమేషన్ ‘టాయ్ స్టోరీ 5’ డిజిటల్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి.

 

 సోనీలివ్‌:
 సోనీలివ్‌లో కామెడీ డ్రామా ‘హబీబీ’స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. 

 

©️ VIL Media Pvt Ltd.