July 17, 2026

Jana Nayagan Advance Booking: సీఎం విజయ్ బాక్సాఫీస్ దండయాత్ర షురూ.. అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సం

Jana Nayagan Advance Booking: సీఎం విజయ్ బాక్సాఫీస్ దండయాత్ర షురూ.. అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సం
Reading Time: 2 minutes

Jana Nayagan Advance Booking: సీఎం విజయ్ బాక్సాఫీస్ దండయాత్ర షురూ.. అడ్వాన్స్ బుకింగ్స్ బీభత్సం

Caption of Image.

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో మొదలై దూసుకుపోతోంది. మూడు గంటల మూడు నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమాను 30 దేశాల్లో సుమారు 8 వేల స్క్రీన్‌లలో విడుదల చేస్తూ భారీ అంచనాలు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే ‘జన నాయగన్’ కోసం అభిమానులు పిచ్చ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. 

అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్..

జూలై 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ దూసుకుపోతోంది. తమిళనాడులో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాకముందే బెంగళూరులో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ విజయ్ అభిమానులు హాట్ కేకుల్లా టికెట్లు బుక్ చేస్తున్నారు. ముఖ్యంగా మార్నింగ్ 6 గంటల ఫస్ట్ డే ఫస్ట్ షోలకు టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.

విజయ్ క్రేజ్ తమిళనాడును దాటి ఇతర రాష్ట్రాల్లోనూ ఏ స్థాయిలో ఉందో ఇది మరోసారి నిరూపిస్తోంది. అయితే, ఈ బెంగళూరు సిటీలోనే అత్యంత ఫెమస్ థియేటర్లో ఒకటైన విక్టరీ సినిమా థియేటర్, నిర్మాతలతో వచ్చిన ఫైన్షియల్ విభేదాల కారణంగా సినిమాను ప్రదర్శించడం నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

‘పుష్ప 2’, ‘జవాన్’ సరసన ‘జన నాయగన్’ 

భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ‘జన నాయగన్’ మరో ఘనత సాధించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 8,000 స్క్రీన్‌లలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ (12 వేలకుపైగా స్క్రీన్‌లు), ‘జవాన్’(10 వేల స్క్రీన్‌లు) వంటి భారీ రిలీజ్‌ల సరసన నిలిచింది. తమిళ సినిమా అయినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో విడుదల కావడం విజయ్ గ్లోబల్ క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక ‘కల్కి 2898 ఏడీ’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమాలు సుమారు 9,500 స్క్రీన్‌లలో, ‘RRR’ దాదాపు 9 వేల స్క్రీన్‌లలో విడుదలయ్యాయి.

30కి పైగా దేశాల్లో రిలీజ్

‘జన నాయగన్’ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విడుదల కానుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ, ప్రీ-సేల్స్ ఇప్పటికే రూ.4 కోట్ల మార్క్ దాటినట్లు సమాచారం. తమిళనాడులో జూలై 19న బుకింగ్స్ ఓపెన్ కానుండగా, అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెన్సార్ వివాదం తర్వాత క్లియరెన్స్

‘జన నాయగన్’సెన్సార్ ప్రక్రియ 2025 డిసెంబర్‌లో ప్రారంభమైంది. కొన్ని అభ్యంతరాల కారణంగా ఆలస్యం అయినప్పటికీ, మార్పుల అనంతరం చివరకు సినిమాకు ‘A’ సర్టిఫికేషన్ లభించింది.

ALSO READ : ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’..

‘A’ సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.

©️ VIL Media Pvt Ltd.