Reading Time: < 1 minute

దేవుడి మహిమ : ఒక్క రోజే తిరుమల వెంకన్నకు రూ.96 కోట్ల విరాళం

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో మంగళవారం ( జులై 14 ) టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో సుమారు రూ. 96.98 కోట్ల విరాళాలు వచ్చినట్లు తెలిపారు అధికారులు.

ఆన్ లైన్ ద్వారా 2వేల 354 మంది దాతలు విరాళాలు సమర్పించారని..ఆఫ్ లైన్ ద్వారా 106 మంది దాతలు విరాళాలు సమర్పించారని తెలిపారు టీటీడీ అధికారులు.1212 మంది దాతలు రూ 1లక్ష నుండి‌  రూ 10 లక్షల లోపు విరాళం సమర్పించగా…1246 మంది భక్తులు రూ 10 లక్షలు నుండి రూ 25 లక్షల లోపు విరాళం సమర్పించినట్లు తెలిపారు అధికారులు. ఇద్దరు భక్తులు రూ 1 కోటి ..అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారని తెలిపారు అధికారులు.

►ALSO READ | తిరుమలలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు..గదులకు..దర్శనానికి అధికారిక వెబ్సైట్నే ఉపయోగించాలి
 
ఇవాళ్టి నుండి కొత్త డోనర్ పాలసీ అమలు కావడంతో…నిన్న పెద్దమొత్తంలో దాతలు విరాళాలు సమర్పించినట్లు తెలుస్తోంది. సామాన్యభక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో పెట్టుకొని డోనర్ ప్రివిలైజెస్ లో మార్పులు చేసినట్లు తెలిపింది టీటీడీ.

©️ VIL Media Pvt Ltd.