July 17, 2026

Aamir Khan: సోనం వాంగ్‌చుక్ దీక్షపై మౌనం వీడిన ఆమిర్ ఖాన్.. ‘3 ఇడియట్స్’ పాత్రపై క్లారిటీ!

Aamir Khan: సోనం వాంగ్‌చుక్ దీక్షపై మౌనం వీడిన ఆమిర్ ఖాన్.. '3 ఇడియట్స్' పాత్రపై క్లారిటీ!
Reading Time: 2 minutes

Aamir Khan: సోనం వాంగ్‌చుక్ దీక్షపై మౌనం వీడిన ఆమిర్ ఖాన్.. ‘3 ఇడియట్స్’ పాత్రపై క్లారిటీ!

Caption of Image.

సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన దీక్ష దేశ 20వ రోజుకు చేరింది. అయితే, ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ మౌనం వహించడంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ‘3 ఇడియట్స్’మూవీలో ఆమీర్ నటించిన ఐకానిక్ క్యారెక్టర్ ‘ఫున్సుఖ్ వాంగ్డు’పాత్రకు అసలు ప్రేరణ సోనమ్ వాంగ్చుకేనని అందరూ నమ్ముతుండటమే దీనికి కారణం. లేటెస్ట్ గా ఈ వివాదంపై ఆమీర్ ఖాన్ స్పందించారు.

అసలు నిజం ఇదే..

లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI)లో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా అమీర్ ఖాన్ ను సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో పాటు, ‘3 ఇడియట్స్’లోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర నిజానికి సోనం వాంగ్‌చుక్ జీవితాన్నే ఆధారంగా చేసుకుని రూపొందించారా? అని ప్రశ్నించారు. దీనిపై అమీర్ స్పందిస్తూ.. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఆ సినిమా తీస్తున్న సమయంలో నాకు, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి, రచయిత అభిజాత్ జోషికి సోనం వాంగ్‌చుక్ గురించి అసలు తెలియదు. ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర ఆయనను ఆధారంగా చేసుకుని రూపొందించలేదు అని తేల్చిచెప్పారు.

సోనం ఆరోగ్యంపై ఆందోళన..

అయితే  సోనం వాంగ్‌చుక్ చేస్తున్న సామాజిక సేవలను ఆమీర్ ప్రశంసించారు. ఆయన చేస్తున్న పని ఎంతో గొప్పది. ఆయనను గౌరవించడానికి ‘3 ఇడియట్స్’ పాత్రతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సేవలకే గౌరవం ఇవ్వాలి’ అని అన్నారు. అంతేకాకుండా, ఈ విషయం గురించి సోనం వాంగ్‌చుక్ కూడా గతంలో తానే స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం గురించి మేమంతా ఆందోళన చెందుతున్నాం.. ఈ దీక్ష సానుకూలంగా ముగియాలని, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం అని అమీర్ విజ్ఞప్తి చేశారు.

 

బాలీవుడ్ మద్దతు.. 

ఇదిలా ఉంటే, జీనత్ అమన్, సోని రజ్దాన్, ఓమీ వైద్య, ఇమ్రాన్ ఖాన్, అదితి రావు హైదరి, సోనాక్షి సిన్హా, ఫాతిమా సనా షేక్, స్వర భాస్కర్ తదితర సినీ ప్రముఖులు ఇప్పటికే సోనం వాంగ్‌చుక్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఆమిర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆయన చెప్పింది వాస్తవమేనని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఆలస్యంగా స్పందించారని విమర్శిస్తున్నారు. దీంతో సోనం వాంగ్‌చుక్ దీక్షతో పాటు ‘3 ఇడియట్స్’లోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్రపై చర్చ మరోసారి జోరందుకుంది.

©️ VIL Media Pvt Ltd.