July 14, 2026

పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా? ప్రాణాలు తీసే పెద్ద తప్పు ఇదే! వైద్యుల హెచ్చరిక

పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా? ప్రాణాలు తీసే పెద్ద తప్పు ఇదే! వైద్యుల హెచ్చరిక
Reading Time: < 1 minute
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా? ప్రాణాలు తీసే పెద్ద తప్పు ఇదే! వైద్యుల హెచ్చరిక

గ్రామీణ ప్రాంతాలలో లేదా పొలాల్లో పనిచేసేటప్పుడు పాము కాటు బారిన పడటం చూస్తుంటాం. అయితే, పాము కరిస్తే వెంటనే చాలా మంది సినిమాల్లో చూసి ప్రభావితమై.. బాధితుడిని రక్షించాలనే ఆరాటంతో పాము కాటు వేసిన చోట నోటితో విషాన్ని గట్టిగా పీల్చి బయటకు ఉమ్మివేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ పద్ధతి అత్యంత ప్రమాదకరమైనదని, దీనివల్ల రక్షించబోయిన వారి ప్రాణాలు కూడా పోతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తన భర్తను కాపాడబోయిన ఒక భార్య కూడా ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఒక నిజ జీవిత ఉదాహరణతో నోటితో విషం పీల్చడం ఎందుకు తప్పో ఇక్కడ తెలుసుకుందాం.

భర్తను కాపాడబోయి ప్రమాదంలో పడ్డ భార్య!

ఒక భయంకరమైన ఘటనలో, పాము కాటుకు గురైన భర్తను చూసి కంగారు పడింది అతని భార్య. వెంటనే అతని శరీరంలో నుండి విషాన్ని తీసేయడానికి నోటితో ఆ గాయాన్ని పీల్చింది. అయితే దురదృష్టవశాత్తూ, ఆమె నోటిలో ఉన్న చిన్నపాటి అల్సర్లు లేదా కంటికి కనపడని గాయాల ద్వారా ఆ పాము విషం ఆమె రక్తంలోకి కూడా వేగంగా ప్రవేశించింది. దీనివల్ల భర్తతో పాటు భార్య కూడా తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

నోటితో విషాన్ని ఎందుకు పీల్చకూడదు?

మన నోటి లోపల చిన్న చిన్న చీలికలు లేదా చిగుళ్ల సమస్యలు సాధారణంగా ఉంటాయి. విషాన్ని పీల్చినప్పుడు అది నేరుగా ఆ గాయాల ద్వారా రక్తప్రవాహంలో కలిసిపోతుంది. నోటి ద్వారా ప్రవేశించే విషం, శరీరంలోని ఇతర భాగాల కంటే చాలా వేగంగా మెదడు, గుండెకు చేరుకుంటుంది. దీనివల్ల విషాన్ని పీల్చిన వ్యక్తి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.

పాము కాటుకు ఏకైక ప్రాణరక్షక నివారణ ఆసుపత్రిలో ఇచ్చే యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్ మాత్రమే. కాబట్టి, ప్రథమ చికిత్స పేరిట అశాస్త్రీయమైన పద్ధతులు పాటించి ఒకేసారి ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..