July 14, 2026

ఫుట్‌బాల్ ఫ్యాన్స్కి కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్.. తెల్లవారుజాము వరకు హోటళ్లు ఓపెన్!

ఫుట్‌బాల్ ఫ్యాన్స్కి కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్.. తెల్లవారుజాము వరకు హోటళ్లు ఓపెన్!
Reading Time: 2 minutes

ఫుట్‌బాల్ ఫ్యాన్స్కి కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్.. తెల్లవారుజాము వరకు హోటళ్లు ఓపెన్!

Caption of Image.

Karnataka Govt: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) క్లైమాక్స్‌కు చేరుకోవడంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. జూలై 14న ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ జట్ల మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌తో ఈ అసలైన పోరు మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం జూలై 15 బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ లేట్ నైట్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేయాలనుకునే బెంగళూరు ఫుట్‌బాల్ అభిమానుల కోసం కర్ణాటక సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

అర్ధరాత్రి వరకు హోటళ్లు ఓపెన్:
బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు జూలై 14, 15, 19 తేదీలలో తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచడానికి కన్నడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను స్క్రీన్‌లపై వీక్షించే అభిమానుల కోసం ఈ అదనపు సమయాన్ని కేటాయించారు.

రెస్టారెంట్ అసోసియేషన్ విజ్ఞప్తితో సర్కార్ గ్రీన్ సిగ్నల్: 
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) చేసిన ప్రత్యేక విజ్ఞప్తితో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 1:00 గంటలకే మూతపడే హోటళ్లు, ఫుడ్ సర్వీస్ సమయాలను ఈ మూడు రోజులు మాత్రం తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఫుట్‌బాల్ క్రీడ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తుందని, ఈ సంబరాన్ని అభిమానులు కలిసి ఆస్వాదించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

►ALSO READ | సూర్య రీఎంట్రీకి బీసీసీఐ కండీషన్.. ఇక నిర్ణయం అతని చేతుల్లోనే!

బాధ్యతగా ఎంజాయ్ చేయండి: సీఎం డీకే
ఈ సడలింపులు ఇచ్చినప్పటికీ శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి మ్యాచ్‌లను ఆస్వాదించే క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు. ప్రజా భద్రత, శాంతిభద్రతలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత, ఫుట్‌బాల్ అభిమానులంతా బాధ్యతాయుతంగా మ్యాచ్‌లను ఆస్వాదించాలని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి శివకుమార్ ఎక్స్ (ట్వీట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.