ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

కాపు ఉద్యమ ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాసేవను ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజల ఆశీర్వాదం పొందారని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి, ఆయన సతీమణి, కుమారులు, కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలి
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా…— JanaSena Party (@JanaSenaParty) July 14, 2026