Reading Time: < 1 minute

ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఎక్కడ?…ప్రభుత్వానికి హరీశ్ రావు ప్రశ్న

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల కోసం తీసుకొస్తామని చెప్పిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇంకా అమలు కాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్​అయ్యారు. హడావుడి ఎక్కువ.. పని తక్కువ అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో విమర్శించారు. హెల్త్ కార్డులు ఇస్తామని, వెంటనే ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పినా.. ఇప్పటికీ మార్గదర్శకాలు లేవని, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ఆస్పత్రులతో పూర్తిస్థాయి ఒప్పందాలు కూడా కాలేదని ఆరోపించారు. 

పథకం అమలు చేయకముందే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల నుంచి రెండు నెలలుగా 1.5 శాతం కోత వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.