Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్‌షిప్ EV

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారత మార్కెట్లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానుంది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV Volvo EX90ను 2026 ఆగస్టు 19న భారత్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భారత మార్కెట్‌లో వోల్వో నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇదే కాగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఇది అత్యున్నత స్థాయి ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది.
రెండు బ్యాటరీ ఆప్షన్లు
Volvo EX90ను ఆధునిక 800V ఆర్కిటెక్చర్ పై అభివృద్ధి చేశారు. ఈ SUV రెండు బ్యాటరీ ఎంపికల్లో అందుబాటులోకి రానుంది.
92kWh బ్యాటరీ ప్యాక్
రియర్ వీల్ డ్రైవ్ (RWD)
333 హెచ్‌పీ పవర్
480Nm టార్క్
0-100 కి.మీ/గం వేగం కేవలం 6.6 సెకన్లలో
565 కి.మీ WLTP రేంజ్
106kWh బ్యాటరీ ప్యాక్
డ్యూయల్ మోటార్ AWD సెటప్
బేస్ వేరియంట్: 456 హెచ్‌పీ, 670Nm టార్క్
పెర్ఫార్మెన్స్ వేరియంట్: 680 హెచ్‌పీ, 870Nm టార్క్
4 సెకన్లలో 100 కి.మీ వేగం
పెర్ఫార్మెన్స్‌ను ఇష్టపడే వారికి EX90 మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. బేస్ AWD వేరియంట్: 0-100 కి.మీ/గం వేగం 5.3 సెకన్లు. పెర్ఫార్మెన్స్ వేరియంట్: 0-100 కి.మీ/గం వేగం కేవలం 4 సెకన్లు. రేంజ్ విషయానికి వస్తే.. 106kWh బేస్ వేరియంట్.. 608 కి.మీ.. పెర్ఫార్మెన్స్ వేరియంట్.. 602 కి.మీ (WLTP) లగ్జరీ క్యాబిన్, భారీ టచ్‌స్క్రీన్. Volvo EX90 ఇంటీరియర్‌ను అత్యంత మినిమలిస్టిక్ డిజైన్‌తో రూపొందించారు.
ప్రధాన హైలైట్స్.. 14.5 అంగుళాల Google ఆధారిత పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్.. 9 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.. 13.2 అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, చాలా తక్కువ ఫిజికల్ బటన్లు, ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకోనున్న EX90. ఈ ఎలక్ట్రిక్ SUVలో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 5G కనెక్టివిటీ, డిజిటల్ కీ, OTA (Over-the-Air) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ప్రీమియం Bose సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో పార్క్ అసిస్ట్.
భద్రతలో కొత్త ప్రమాణం
భద్రత విషయంలో వోల్వో ఎప్పటిలాగే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. లెవెల్-3 ADAS, Vehicle-to-Load (V2L) సపోర్ట్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీలు. అదనంగా, ఈ SUVకి Euro NCAP మరియు ఇతర ప్రముఖ క్రాష్ టెస్ట్ సంస్థల నుంచి 5-స్టార్ భద్రతా రేటింగ్ లభించింది. దీంతో ఇది ఇప్పటివరకు వోల్వో రూపొందించిన అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.
భారత్‌లో ఎవరితో పోటీ?
భారత లగ్జరీ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో Volvo EX90 Mercedes-Benz EQS SUV, BMW iX, Audi Q8 e-tron, Kia EV9 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అధిక రేంజ్, అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి భద్రత, లగ్జరీ ఫీచర్లతో EX90 ప్రీమియం EV కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశముంది.