July 15, 2026

హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ కూల్చేస్తున్నారు.. ఈ 5 స్టార్ హోటల్ ప్లేస్లో..

హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ కూల్చేస్తున్నారు.. ఈ 5 స్టార్ హోటల్ ప్లేస్లో..
Reading Time: < 1 minute

హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ కూల్చేస్తున్నారు.. ఈ 5 స్టార్ హోటల్ ప్లేస్లో..

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో ఉన్న ఫేమస్ 5 స్టార్ హోటల్ తాజ్ బంజారా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. చెరువు ఒడ్డున ఉన్న ఈ 5 స్టార్ హోటల్ స్థానంలో Auro Realty 40 అంతస్తుల హై రైజ్ టవర్ కట్టాలని నిర్ణయించింది.

ఈ ప్రాపర్టీ మొత్తాన్ని ఈ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ Auro Realty రూ.315 కోట్లకు సొంతం చేసుకుంది. కోటీ 43 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పెండింగ్లో ఉందని తాజ్ బంజారా హోటల్కు GHMC 2025లో సీల్ వేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ బకాయిలు చెల్లించడంతో ఈ సీల్ తొలగించింది. అయితే.. 2023 నుంచే తాజ్ బంజారా హోటల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. లీజ్ ఎక్స్పైర్ కావడమే ఇందుకు కారణం.

హైదరాబాద్ సిటీలోని ఈ తాజ్ బంజారా హోటల్కు దాదాపు 47 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. తొలుత ఈ 5 స్టార్ హోటల్ను ITC గ్రూప్ నడిపింది. ఆ తర్వాత తాజ్ GVK హోటల్స్ దాదాపు 40 ఏళ్ల పాటు తాజ్ బంజారాను దిగ్విజయంగా కొనసాగించింది. ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభమైన ఈ కూల్చివేత పనులు ఇప్పుడు నిర్మాణ కూల్చివేత దశకు చేరుకున్నాయి. హోటల్ బయట గోడలను కూల్చేస్తుండటంతో తాజ్ బంజారా కూల్చేస్తున్న విషయం అందరికీ తెలిసింది.

తొలుత.. తలుపులు, కిటికీలు, విద్యుత్ వైరింగ్, ఐరన్ ఫిక్చర్లను తొలగించారు. ఈ కూల్చివేతలు మొత్తం పూర్తి అయి తాజ్ బంజారా హోటల్ నేలమట్టం కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని కాంట్రాక్టర్ చెప్పారు. తాజ్ బంజారా హోటల్ ఎంతో మంది ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చింది. ముఖ్యమంత్రులు మొదలుకుని ఎంతో మంది ప్రముఖులు ఈ హోటల్లో కాన్ఫరెన్స్లు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.