July 17, 2026

అది నల్లతాచు పాము తల్లీ.. ఏదో తాడును పట్టుకున్నట్లు పట్టుకున్నావ్.. మాకు చూస్తేనే వణుకు వస్తోంది..!

అది నల్లతాచు పాము తల్లీ.. ఏదో తాడును పట్టుకున్నట్లు పట్టుకున్నావ్.. మాకు చూస్తేనే వణుకు వస్తోంది..!
Reading Time: 2 minutes

అది నల్లతాచు పాము తల్లీ.. ఏదో తాడును పట్టుకున్నట్లు పట్టుకున్నావ్.. మాకు చూస్తేనే వణుకు వస్తోంది..!

Caption of Image.

విషసర్పాలను కాపాడుతూ ఎంతోమంది ప్రాణాలను రక్షించిన   స్నేక్ క్యాచర్ జానకీ దేవి జీవితంలో ఒక ఊహించని విషాదం జరిగింది. నిత్యం ప్రాణాలకు తెగించి పాములను పట్టుకునే ఆమె, ఒక రెస్క్యూ ఆపరేషన్ సమయంలో నాగుపాము కాటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె నేపాల్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.

ఎం  జరిగిందంటే… బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషహ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అక్కడ నివసించే మున్నిలాల్ అనే వ్యక్తి ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవున్న ఒక భారీ నాగుపాము చొరబడింది. ఆ విష సర్పం చూడటానికి చాలా భయంకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రాణాల మీదకు తెచ్చిన రెస్క్యూ ఆపరేషన్
ఇంట్లో పాము ఉందన్న సమాచారం అందగానే, ఆ ప్రాంతంలో ‘సర్ప మిత్ర’గా పేరు తెచ్చుకున్న జానకి దేవి వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ నాగుపాము చాలా పెద్దది కావడంతో ఆమె ఎంతో చాకచక్యంగా దాని పడగను ఒక చేత్తో పట్టుకుని, మిగిలిన శరీరాన్ని తన మెడ చుట్టూ వేసుకున్నారు. దాన్ని సమీపంలోని వాల్మీకినగర్ అడవిలో వదిలేయడానికి రెడీ అయ్యారు. 

అయితే, దురదృష్టవశాత్తూ ఆ పాము అకస్మాత్తుగా ఉగ్రరూపం దాల్చి జానకి దేవిని బలంగా కాటు వేసింది. నాగుపాము విషం ఒంట్లోకి చేరడంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి చాలా విషమంగా మారింది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే సరిహద్దు దాటించి, నేపాల్‌లోని త్రివేణిలో ఉన్న ప్రత్యేక పాముకాటు చికిత్సా కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

2వేల పాములను కాపాడిన వీరనారి
జానకి దేవి ఆ ప్రాంతంలో ఎంతో గౌరవం పొందిన స్నేక్ క్యాచర్. గత కొన్నేళ్లుగా ఆమె ఇళ్లు, పొలాలు, జనావాసాల్లోకి వచ్చే దాదాపు 2,000 విషపూరిత పాములను పట్టుకుని, ఎవరికీ హాని జరగకుండా అడవుల్లో వదిలేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆమె ఇప్పుడు హాస్పిటల్ బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతుండటంతో స్థానిక ప్రజలు, సామాజిక సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నారు.

ALSO READ : విడాకులు తీసుకున్నాడని.. పిల్లాడు కూడా ఉన్నాడని తెలియక ప్రేమాయణం..

 అటవీ శాఖ హెచ్చరిక
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, అడవులు నీటితో నిండిపోతున్నాయని, అందుకే పాములు సురక్షితమైన స్థావరం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

 మీ ఇళ్లు, పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని…  పొరపాటున పాము కనిపిస్తే దాన్ని స్వయంగా చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకండి. వెంటనే అటవీ శాఖకు లేదా శిక్షణ పొందిన పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించండి అంటూ అధికారులు ప్రజలకు  సూచనలు ఇచ్చారు. 

 

©️ VIL Media Pvt Ltd.