July 14, 2026

మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం… ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు…

మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం... ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు...
Reading Time: < 1 minute

మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం… ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు…

Caption of Image.

ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. మంగళవారం ( జులై 14 ) విశాఖలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన జగన్… ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 7 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. 

ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుండి బయటపడిన మత్స్యకారుడు చిన్నాను పరామర్శించిన జగన్, అతడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు జగన్వైసీపీ తరపున జగన్ ఆర్థిక ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.

ALSO READ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు జగన్. బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు జగన్. ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదని.. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదని మండిపడ్డారు. బాధితులను ఫిషరీస్ మంత్రి కూడా పరామర్శించలేదని…బాధితుల దగ్గరికి మంత్రిని పంపాలని సీఎంకు తెలీదా అని ప్రశ్నించారు జగన్. రాత్రికి రాత్రే స్పందించి ఉంటె మత్స్యకారులు బతికేవారని అన్నారు జగన్. ఎక్స్ గ్రేషియా కింద అరకొర సాయం ప్రకరించారని.. బాధితులకు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు జగన్.
 

©️ VIL Media Pvt Ltd.