Vastu tips :బెడ్ రూంలో అద్దం ఏ దిక్కులో ఉండాలి.. అక్కడ నేలపై పడుకుంటే దోషం ఉంటుందా..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. బెడ్రూం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. బెడ్ రూంలో అద్దం.. డ్రస్సింగ్ రూం ఏ దిక్కులో ఉండాలి.. అలాగే బెడ్ రూంలో నేలపై పడుకుంటే దోషం కలుగుతుందా…..మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం…
ప్రశ్న: మాస్టర్ బెడ్ రూంలో అద్దం ఏవైపు ఉండాలి?
జవాబు: బెడ్ రూంలో ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలో అద్దం… డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు చెబుతున్నారు.
ప్రశ్న: నైరుతి వైపు బెడ్ రూంలో నేలమీద పడుకోవచ్చా?
జవాబు: మాస్టర్ బెడ్రూమ్ లో నేలమీద పడుకోవడంలో ఎలాంటి దోషం లేదు. బెడ్ పైనే పడుకోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే బెడ్ సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా గది ఏర్పాటు చేసుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు సూచిస్తున్నారు