రోడ్డు ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ గన్ మెన్ మృతి

గజ్వేల్, వెలుగు: 2026, జూలై 15వ తేదీ రాత్రి గజ్వేల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సెక్యూరిటీ వింగ్ లో గన్ మెన్ గా పని చేస్తున్న కిరణ్ అనే కానిస్టేబుల్ చనిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రతను పర్యవేక్షించే సెక్యూరిటీ వింగ్ లో గన్ మెన్ విధులు నిర్వహిస్తున్నాడు ఈ కానిస్టేబుల్ కిరణ్. 2009 బ్యాచ్ కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన కిరణ్.. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి వద్ద గన్‌మెన్‌గా సేవలు అందించారు. విధి నిర్వహణలో సమర్థత, నిబద్ధతతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న కిరణ్.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఆరె కిరణ్(35) సిద్దిపేట ఏఆర్‌విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విధుల్లో ఉన్నారు.
మంగళవారం రాత్రి సిద్దిపేట నుంచి కారులో హైదరాబాద్ వెళ్తున్నాడు. పాతూరు జంక్షన్ సమీపంలోకి చేరుకోగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న గజ్వేల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.