వచ్చే ఎన్నికల్లో మా టార్గెట్ 120… దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ స్వీప్ చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తమ టార్గెట్ 120 సీట్లని… దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ స్వీప్ చేస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం ( జులై 15 ) కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమ లక్ష్యమని… రాహుల్ గాంధీ గెలుపు కోసం అందరు కలిసి పని చేయాలని అన్నారు. కొంతమంది మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లారని… తాను మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.
తుంగతుర్తి విషయం అన్ని తెలిసిన వ్యక్తి జగ్గారెడ్డి చూసుకుంటారని.. లోకల్ ఎమ్మెల్యే అందరితో సమన్వయం చేసుకుంటాడని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.రోడ్ల మీదకు వచ్చి కొట్టుకోవద్దని… సమస్యలు ఉంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ దృష్టికి తేవాలని అన్నారు కోమటిరెడ్డి.
35ఏండ్ల నుండి ప్రజా జీవితంలో ఉన్నానని… 13వేల కోట్ల RB నిధులు,7వేల కోట్ల పంచాయితీ రాజ్ రోడ్లకు నిధులు తీసుకొచ్చానని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో రోడ్లు వేస్తున్నామని…గడ్కరీతో మాట్లాడి 2వేల కోట్ల సీఆర్ఎఫ్ ఫండ్స్ తెచ్చానని అన్నారు కోమటిరెడ్డి.
►ALSO READ | తెలంగాణలో SIR ప్రక్రియ గడువు ఆగస్ట్ 3 వరకూ పొడిగింపు
జగ్గారెడ్డి పై ఆసక్తి కర వ్యాఖ్యలు:
జగ్గారెడ్డి రెడ్డి ని రాహుల్ గాంధీ ఇష్టపడతారని.. జగ్గారెడ్డి పేదల మనిషి,మాస్ లీడర్ అని… అందరికి సాయం చేస్తారని కొనియాడారు. సిద్దిపేట లో జగ్గారెడ్డి పోటీ చేస్తే పూర్తిగా తమ మద్దతు ఉంటుందని అన్నారు. హరీష్ రావు, రఘునందన్ రావు మీద రెండు వేల మెజారిటీ తో మాత్రమే గెలిచిండని అన్నారు.