ఎలుక కరిస్తే వెంటనే ఇలా చేయండి.. పొరపాటున ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..

ప్రస్తుతం చాలామంది ఇళ్లలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఎలుకల సంచారం ఒకటి. ఇవి ఇంట్లోని వస్తువులను పాడు చేయడమే కాకుండా ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకవేళ ఎలుక ఎవరినైనా కరిస్తే.. దానిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఎలుకల పళ్లలో అనేక రకాల ప్రమాదకర బ్యాక్టీరియా, కీటకాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరితే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో ఆందోళన చెందకుండా వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలుక కరిచినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? అలాగే ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎలుక కరిచినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స
గాయాన్ని శుభ్రం చేయడం: ఎలుక కరిచిన వెంటనే చేయాల్సిన మొదటి పని గాయాన్ని శుభ్రం చేయడం. టాప్ వాటర్, సబ్బుతో గాయం ఉన్న చోట కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కడగాలి. దీనివల్ల గాయంలోని మురికి, క్రిములు బయటకు పోతాయి.
పసుపు లేపనం: పసుపులో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత, కొద్దిగా పసుపులో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి గాయం చుట్టూ రాయవచ్చు. అయితే గాయం తీవ్రంగా ఉంటే లోపలి భాగంలో ఎలాంటి పదార్థాలను పెట్టకూడదు.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో వాపును తగ్గించే గుణాలు ఉంటాయి. గాయాన్ని కడిగిన తర్వాత ఆ ప్రాంతంలో కొబ్బరి నూనె రాస్తే మంట తగ్గి, చర్మానికి ఉపశమనం లభిస్తుంది.
వేపాకు నీరు: శుభ్రమైన వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చాలి. ఆ నీటితో గాయం చుట్టూ ఉన్న చర్మాన్ని శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గుతుంది.
ఐస్ ముక్కలతో ఉపశమనం: ఎలుక కరిచిన చోట వాపు లేదా నొప్పి ఉంటే.. ఒక గుడ్డలో ఐస్ ముక్కలను చుట్టి గాయంపై కొద్దిసేపు ఉంచాలి. దీనివల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఐస్ ముక్కలను నేరుగా చర్మంపై పెట్టకూడదు.
గమనిక: ఇవన్నీ కేవలం ప్రాథమిక ఉపశమనం కోసమే. ఎలుక కరిచినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, అవసరమైన ఇంజెక్షన్లు తీసుకోవడం సురక్షితం.
ఇంట్లో నుండి ఎలుకలను పారద్రోలే అద్భుతమైన చిట్కా..
ఇంట్లో ఎలుకల సంఖ్యను తగ్గించడానికి, వి రాకుండా చేయడానికి ఒక సులువైన హోమ్ మేడ్ స్ప్రేని తయారు చేసుకోవచ్చు..
కావలసిన పదార్థాలు:
- ఒక గ్లాసు నీరు
- రెండు స్పూన్ల పుదీనా రసం
- రెండు స్పూన్ల వెనిగర్
- ఒక స్పూన్ నిమ్మరసం
- తయారీ విధానం – వాడే పద్ధతి
ఒక గ్లాసు నీటిలో పుదీనా రసం, వెనిగర్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు, మూలల్లో ఈ లిక్విడ్‌ను స్ప్రే చేయాలి. ఈ మిశ్రమం నుండి వచ్చే ఘాటైన వాసనకు ఎలుకలు ఆ ప్రదేశాలకు దూరంగా పారిపోతాయి. ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా ఎలుకల సమస్య నుండి మీ ఇంటిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.