పాపం ఈ అమ్మాయి.. బస్టాండ్లో బస్ కోసం చూస్తుంటే ఎక్కడ నుంచి వచ్చిండో వచ్చిండు !

బంట్వాల్: కర్ణాటకలో పట్టపగలు దారుణం జరిగింది. ఒక యువతి బస్సు కోసం బస్టాండ్లో ఎదురుచూస్తుండగా ఓ ఉన్మాది ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి చనిపోయింది. నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బంట్వాల్‌లోని బీసీ రోడ్డులో ఉన్న కేఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది.
A young woman was allegedly hacked to death in broad daylight at the KSRTC bus stand in Bantwal on Thursday, triggering panic among commuters and prompting police to launch a massive search for the absconding accused.
The deceased has been identified as Lavanya, a resident of… https://t.co/9sbt99ezfV pic.twitter.com/BZuCgqv0yu
— Hate Detector 🔍 (@HateDetectors) July 16, 2026
నిందితుడు బాధితురాలిపై దాడి చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని అక్కడే పడేసి వెళ్లిపోయిన దృశ్యాలు కెమెరాలో రికార్డవడం గమనార్హం. బాధితురాలిని బంట్వాల్‌లోని ఉలిగ్రామ్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల లావణ్యగా గుర్తించారు. కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఆమె పనిచేస్తుంది. నిందితుడిని కర్ణాటకలోని బెల్తంగడి జిల్లా, ఒడిల్నాలకు చెందిన చేతన్‌గా గుర్తించారు. దాడికి కారణాలు తెలియలేదు.
►ALSO READ | హైదరాబాద్ సనత్ నగర్లో మైనర్పై గ్యాంగ్ రేప్.. స్కూల్కి వెళ్తుండగా ఫాలో చేసి..
ప్రేమోన్మాది ఘాతుకంగానే పోలీసులు భావిస్తున్నారు. అతని లవ్ ప్రపోజల్ను తిరస్కరించడం వల్ల కక్ష పెంచుకుని దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు తన బ్యాగ్ నుంచి కత్తిని బయటకు తీయడాన్ని గమనించిన లావణ్య పారిపోవడానికి ప్రయత్నించింది. నిందితుడు ఆమెను వెంబడించి.. కత్తితో దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని బంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది.