July 17, 2026

ఓ వైపు భర్త శవం.. మరో వైపు రక్తపు మడుగులో కొడుకు..రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్న భార్య..కర్నాటకలోని ధార్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దారుణం

ఓ వైపు భర్త శవం.. మరో వైపు రక్తపు మడుగులో కొడుకు..రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్న భార్య..కర్నాటకలోని ధార్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దారుణం
Reading Time: < 1 minute

ఓ వైపు భర్త శవం.. మరో వైపు రక్తపు మడుగులో కొడుకు..రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్న భార్య..కర్నాటకలోని ధార్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దారుణం

Caption of Image.

ధార్వాడ్: ఓ వైపు రక్తపు మడుగులో భర్త మృతదేహం, మరోవైపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొడుకు.. ఆమె మాత్రం హాయిగా పడుకుని ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తోంది. కర్నాటకలోని ధార్వాడ్ సిటీలో ఈ ఘటన జరిగింది. ధార్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఒక అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిరణ్ హొనన్నవర్ (45), ఆయన భార్య ప్రియాంక, వారి 8 ఏండ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. కిరణ్ స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనస్థీషియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు.

భార్య ప్రియాంక కంటి డాక్టర్. మంగళవారం రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. ఆ తర్వాత కిరణ్​ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రియాంక మాట్లాడుతూ మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పింది. బుధవారం సాయంత్రం కూడా కిరణ్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నేరుగా వారు ఉంటున్న అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా, లోపల దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు

. ఒకవైపు కిరణ్ మృతదేహం పడి ఉంది. మరోవైపు కొడుకు స్పృహ కోల్పోయాడు. ప్రియాంక మాత్రం మంచం మీద పడుకుని ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్క్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ కనిపించిందని తెలిపారు. ఇద్దరూ చనిపోయారని భావించిన స్థానికులు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించి, సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతికి కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చనే కోణంలో విచారణ చేపట్టారు. 

©️ VIL Media Pvt Ltd.