July 17, 2026

భవిష్యత్ అంతా హైడ్రోజన్‎దే.. రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తం: ప్రధాని మోడీ

భవిష్యత్ అంతా హైడ్రోజన్‎దే.. రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తం: ప్రధాని మోడీ
Reading Time: < 1 minute

భవిష్యత్ అంతా హైడ్రోజన్‎దే.. రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తం: ప్రధాని మోడీ

Caption of Image.

చండీగఢ్: భవిష్యత్ అంతా హైడ్రోజన్ దేనని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్‎లో మరిన్నీ హైడ్రోజన్ రైళ్లు వస్తాయని తెలిపారు. హైడ్రోజన్ రైలు రైల్వే ట్రాక్ పై సరికొత్త విప్లవానికి నాందని పేర్కొన్నారు. రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామని చెప్పారు. శుక్రవారం (జులై 17) హార్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‎లో భారత తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ ఆధారిత రైలును నడిపే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని.. అలాగే అత్యంత పొడవైనది తెలిపారు. ఈ రైలు 10 కోచ్‎లతో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోందని చెప్పారు. 

జింద్-సోనిపట్ మధ్య 89 కి.మీ దూరం ఈ ట్రైన్ ప్రయాణిస్తుందన్నారు.    పర్యావరణరహిత ప్రాజెక్టులో భాగంగానే హైడ్రోజన్ రైలు తీసుకొచ్చామని తెలిపారు. హైడ్రోజన్ రైలుతో హర్యానా పేరు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారతీయ రైల్వే రూపురేఖలు మార్చడంలో ఇది కీలకమైన ముందడుగని పేర్కొన్నారు. 

ALSO READ : సోనం వాంగ్‌చుక్ దీక్షపై మౌనం వీడిన ఆమిర్ ఖాన్..

ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే:

జింద్, సోనిపట్ మధ్య నడవనున్న ఈ రైలు.. అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇది హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుని విద్యుత్తును తయారు చేస్తుంది. ఈ క్రమంలో కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. డీజిల్ రైళ్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు తక్కువ శబ్దాన్ని చేస్తూ.. పర్యావరణహితంగా ప్రయాణాన్ని అందిస్తుంది. పది కోచ్ల సామర్థ్యం, 3,200 హార్స్ పవర్ శక్తి గల ఈ ఇంజిన్.. హైడ్రోజన్ రైలు రంగంలోనే అత్యంత శక్తిమంతమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.

©️ VIL Media Pvt Ltd.