July 17, 2026

Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil

Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
Reading Time: 2 minutes
Apple Back To School Sale 2026 Begins In India Discounts On Macbooks Ipads

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు శుభవార్త. ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) భారతదేశంలో తన వార్షిక ‘Back to School’ సేల్ ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో ఎంపిక చేసిన MacBook, iPad మోడళ్లపై స్టూడెంట్ డిస్కౌంట్లతో పాటు AirPods 4, Apple Pencil Pro, AirTags వంటి యాక్సెసరీలను కూడా ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 27, 2026 వరకు కొనసాగుతుంది. కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే విద్యాసంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బంది ఈ ఆఫర్లను పొందవచ్చు.

MacBook Air M5పై ప్రత్యేక ఆఫర్

M5 చిప్‌తో కూడిన MacBook Air (2026) విద్యార్థులకు రూ.1,37,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అదనంగా, AirPods 4 లేదా 4 AirTags ప్యాక్ వాటిలో ఏదో ఒకటి ఉచితంగా పొందవచ్చు. అలాగే, రూ.5,000 అదనంగా చెల్లించి AirPods 4 (ANC) పొందవచ్చు. రూ.13,000 చెల్లించి AirPods Pro 3కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. MacBook Pro M5 సిరీస్‌పై కూడా డిస్కౌంట్

విద్యార్థులకు MacBook Pro మోడళ్లు కూడా ప్రత్యేక ధరలకు లభిస్తున్నాయి.

MacBook Pro M5 (2025) – రూ.2,27,900
MacBook Pro M5 Pro (2026) – రూ.2,81,900
MacBook Pro M5 Max (2026) – రూ.4,62,900
ఈ మోడళ్ల కొనుగోలుపై కూడా AirPods 4 లేదా AirTags ప్యాక్ ఉచితంగా అందిస్తున్నారు. అదనపు చెల్లింపుతో AirPods 4 ANC లేదా AirPods Pro 3ను ఎంచుకోవచ్చు.

iPad Air, iPad Proపై ఆఫర్లు

iPad Air (2025) (M4 చిప్‌తో)

ప్రారంభ ధర: రూ.83,900

iPad Pro (2025)

ప్రారంభ ధర: రూ.1,27,900

ఈ రెండు మోడళ్ల కొనుగోలుపై Apple Pencil Proను ఉచితంగా అందిస్తున్నారు. అదనంగా వినియోగదారులు.. రూ.2,000కు AirTags ప్యాక్, రూ.2,000కు AirPods 4
రూ.7,000కు AirPods 4 (ANC), రూ.15,000కు AirPods Pro 3 వంటి ఎంపికలను కూడా పొందవచ్చు.

MacBook Neoపై రూ.10,000 తగ్గింపు

ఇటీవల ఆపిల్ విడుదల చేసిన MacBook Neo కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంది. 256GB స్టోరేజ్ మోడల్ – రూ.69,900, 512GB స్టోరేజ్ (Touch IDతో) – రూ.79,900. ఈ రెండు మోడళ్లపై రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. MacBook Neoలో Apple Silicon A18 Pro చిప్‌సెట్‌ను అందించారు.

విద్యార్థులకు మంచి అవకాశం

ఇటీవల MacBook, iPad మోడళ్ల ధరలను ఆపిల్ పెంచిన నేపథ్యంలో, ఈ Back to School Sale విద్యార్థులు, ఉపాధ్యాయులకు మంచి అవకాశంగా మారింది. తక్కువ ధరలో లేటెస్ట్ Apple డివైస్‌ను కొనుగోలు చేయడంతో పాటు విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందే అవకాశం ఈ సేల్ ద్వారా లభిస్తోంది. ఆపిల్ ఎకోసిస్టమ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ సేల్ అత్యంత ప్రయోజనకరంగా ఉండనుంది.