July 15, 2026

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత 

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత 
Reading Time: < 1 minute

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత 

Caption of Image.
  • ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్​ 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్‌‌‌‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఆయనను రెడ్‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకుని, కేసు నమోదు చేశారు. స్థానిక కాంట్రాక్టర్ పెద్దపల్లి గ్రేవ్ యార్డ్స్​అభివృద్ధి పనులు చేశాడు. ఈ పనులకు సంబంధించి అతనికి రూ. 12 లక్షలు రావాల్సిఉంది. ఈ బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ మున్సిపల్ ఏఈని కలవగా.. బిల్లు చేయాలంటే రూ. 2 లక్షల లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.

దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనతో మంగళవారం ఉదయం కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడానికి ఏఈ సతీశ్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు, కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా సతీశ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన ఇంట్లో సోదా చేయగా లెక్కలో లేని రూ. 32 లక్షల నగదు కూడా దొరికింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని సతీశ్‌‌‌‌పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ మహేందర్​రెడ్డి వెల్లడించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.