July 17, 2026

కొంపల్లి ఫ్లైఓవర్ కింద వ్యక్తి హత్య.. మృతుడు శ్రీకాకుళం వాసి

కొంపల్లి ఫ్లైఓవర్ కింద వ్యక్తి హత్య.. మృతుడు శ్రీకాకుళం వాసి
Reading Time: < 1 minute

కొంపల్లి ఫ్లైఓవర్ కింద వ్యక్తి హత్య.. మృతుడు శ్రీకాకుళం వాసి

Caption of Image.

జీడిమెట్ల, వెలుగు: ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన పేట్​బషీరాబాద్​పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి చెందిన బేరి నర్సింహులు(35) బతుకుదెరువు కోసం కొంపల్లికి వచ్చాడు. ఇక్కడ లేబర్ గా పనిచేస్తూ ఫైఓవర్​కింద నిద్రించేవాడు. బుధవారం రాత్రి ఓ వ్యక్తి తాగిన మత్తులో నర్సింహులుతో గొడపడ్డాడు. 

అనంతరం అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. గురువారం ఉదయం ఫ్లైఓవర్​నర్సింహులు మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూలీ డబ్బుల విషయంలో వచ్చిన గొడవ హత్యకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశామని, హంతకుడి కోసం గాలిస్తున్నట్లు  తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.