July 15, 2026

చైనాతో పోటీగా తెలంగాణ.. 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్

చైనాతో పోటీగా తెలంగాణ.. 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్
Reading Time: 2 minutes

చైనాతో పోటీగా తెలంగాణ.. 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్

Caption of Image.

తెలంగాణను దేశానికే ఒక రోల్ మోడల్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.  చైనాతో పోటీపడేలా మన ప్రణాళికలు ఉన్నాయని, అగ్రికల్చర్ ఎకానమీని సరికొత్త రేంజ్‌లో సృష్టిస్తామని ప్రభుత్వం స్పష్టం శారు.. ఇందులో భాగంగానే క్యూర్, ఫ్యూర్, రేర్ (Cure, Pure, Rare) అనే మూడు సూత్రాల విజన్‌ను తెరపైకి తెచ్చామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగానే ఇటీవల అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. ఇది ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక పెద్ద ప్రోత్సాహకంగా నిలవనుందన్నారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఘన విజయం సాధించిందని, దాదాపు 3 వేల కార్పొరేట్ సంస్థలు ఈ సమ్మిట్‌కు హాజరయ్యాయని తెలిపారు.

తెలంగాణను అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా.. 2034 నాటికి వన్ ట్రిలియన్ ఎకానమీ, అలాగే 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధించాలని టార్గెట్ పెట్టుకుందన్నారు రేవంత్. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 10 శాతంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తోందన్నారు.  హైదరాబాద్‌ను గ్లోబల్ ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయన్నారు.

సరైన పాలసీలు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదనే ఉద్దేశంతోనే.. ఇప్పటికే టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ (ORR) లోపల కోటి 34 లక్షల మంది జనాభా ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  ఇందులో భాగంగానే మూసీ నది ప్రక్షాళనతో పాటు, మెట్రో రైలును మరింత విస్తరించనున్నామని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈవీ (EV) వాహనాలుగా మార్చే ప్రక్రియను వేగవంతం  చేస్తామన్నారు రేవంత్. నగరంలోని 2 లక్షల డీజిల్ ఆటోలను ఈవీ ఆటోలుగా మార్చడమే కాకుండా.. ఈవీ వాహనాల కొనుగోలుపై జీరో టాక్స్ విధిస్తున్నామని చెప్పారు. . ఈవీ వాహనాలను ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతున్నప్పటికీ.. నగర భవిష్యత్తు ,ప్రజల ఆరోగ్యం కోసం ఆ నష్టాన్ని భరించడానికైనా సిద్ధమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.