July 17, 2026

IND vs ENG: కార్డిఫ్‌లో అలా చేస్తేనే గెలిచేది.. లేదంటే మ్యాచ్ నుంచి కటీఫ్ అవ్వాల్సిందే.. ఎందుకో తెలుసా?

IND vs ENG: కార్డిఫ్‌లో అలా చేస్తేనే గెలిచేది.. లేదంటే మ్యాచ్ నుంచి కటీఫ్ అవ్వాల్సిందే.. ఎందుకో తెలుసా?
Reading Time: 2 minutes
IND vs ENG: కార్డిఫ్‌లో అలా చేస్తేనే గెలిచేది.. లేదంటే మ్యాచ్ నుంచి కటీఫ్ అవ్వాల్సిందే.. ఎందుకో తెలుసా?

Toss Will be Crucial Factor in India vs England 2nd ODI: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో వన్డే సమరానికి కార్డిఫ్ వేదిక సర్వం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేయగా, ఇంగ్లండ్ జట్టుకు ఇది చావో రేవో లాంటి పోరుగా మారింది. అయితే, ఈ అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఇరు జట్ల గెలుపోటములను శాసించబోయేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు, మ్యాచ్ ప్రారంభానికి ముందు వేసే టాస్ కూడా!

టాస్ గెలిచిన జట్టుకే విజయవకాశాలు..!

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదాన చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ టాస్ ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ పిచ్‌పై జరిగిన మొత్తం 29 వన్డే మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 8 సార్లు మాత్రమే విజయాన్ని అందుకోగలిగింది. అదే సమయంలో, లక్ష్యాన్ని చేధించేందుకు (రెండోసారి బ్యాటింగ్) బరిలోకి దిగిన జట్లు ఏకంగా 19 సార్లు విజయకేతనం ఎగురవేసి ఇక్కడ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. మిగిలిన ఒక మ్యాచ్ ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, ఈ మైదానంలో పరుగుల వేట కంటే పరుగులను నియంత్రించడమే సులువైన మార్గమని స్పష్టంగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అతను యమ డేంజర్.. ఏడుగుర్ని దింపినా ఒంటిచేత్తో మా దూల తీర్చాడు.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

కొత్త బంతితో పేసర్ల హవా.. స్పిన్నర్లకు చుక్కెదురేనా?

ఇంగ్లండ్ శీతోష్ణస్థితులకు, అక్కడి స్థానిక వాతావరణానికి తగినట్లే కార్డిఫ్ పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా మారుతుంది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో పేస్ బౌలర్లు వేసే స్వింగ్, సాధించే బౌన్స్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ మైదానంలో జరిగిన గత పది వన్డే మ్యాచ్‌ల రికార్డులను చూస్తే పేస్ బౌలర్లు ఏకంగా తొంభై ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్ల నడుము విరిచారు. మరోవైపు, స్పిన్ బౌలర్లకు ఇక్కడ అంతగా పిచ్ సహకరించకపోవడంతో వారు కేవలం నలభై ఐదు వికెట్లు మాత్రమే తీయగలిగారు. అంటే పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లకు సగం కంటే తక్కువ విజయాలే దక్కాయి.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

కెప్టెన్ల వ్యూహం ఏంటి? ముందుగా ఫీల్డింగే మొగ్గు!

పిచ్‌పై ఉన్న కొద్దిపాటి పచ్చిక, ఉదయం పూట ఉండే తేమను ఉపయోగించుకుని ఇరు జట్లలోని ప్రధాన పేసర్లు వికెట్లు తీసేందుకు కాచుకుని ఉంటారు. ఈ పరిస్థితులన్నింటినీ ముందే అంచనా వేసే ఇరు జట్ల కెప్టెన్లు టాస్ గెలిచిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి, ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే మిడిల్ ఓవర్లలో లక్ష్యాన్ని సులువుగా చేధించాలనేది ఇరు జట్ల ప్రధాన వ్యూహం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..