July 15, 2026

రోజంతా ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? మీ హెల్త్‌పై ఎఫెక్ట్ ఇదే!

రోజంతా ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? మీ హెల్త్‌పై ఎఫెక్ట్ ఇదే!
Reading Time: 2 minutes

ఈ రోజుల్లో చేతిలో ఫోన్, చెవిలో ఇయర్‌బడ్స్ కామన్‌ అయిపోయాయి. ఆఫీస్ వర్క్ అయినా, ప్రయాణాలైనా వీటితోనే కాలక్షేపం. అయితే, రోజంతా ఇలా ఇయర్‌బడ్స్ పెట్టుకోవడం వల్ల మీ చెవులకు ఎంత పెద్ద ముప్పు పొంచి ఉందో తెలుసా? గాలి ఆడకపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం, చివరకు వినికిడి శక్తి తగ్గిపోవడం లాంటి ఎన్నో సమస్యలకు మనం మనమే దారి వేస్తున్నాం. నిపుణుల హెచ్చరికలు, ఇయర్‌బడ్స్ వల్ల జరిగే నష్టాలు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం..

పరిమితి దాటితే ప్రమాదమే: నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం ఇయర్‌బడ్స్ వాడేటప్పుడు ఒక నియమం గుర్తుంచుకోవాలి. వాల్యూమ్‌ను 60 శాతానికి మించకుండా పెట్టుకుని, రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ సమయం వాడితే వినికిడి సమస్యలు తప్పవు. ఇక ఈ మధ్య కాలంలో యువతలో పెరుగుతున్న వినికిడి లోపాలకు హెడ్‌ఫోన్స్ అతిగా వాడటమే ప్రధాన కారణమని నివేదికలు చెప్తున్నాయి.

Using Earbuds All Day? Here's How They May Affect Your Health
Using Earbuds All Day? Here’s How They May Affect Your Health

రబ్బర్ బడ్స్ వద్దు బాబోయ్: మనం వాడే ఇయర్‌బడ్స్‌లో రకరకాల డిజైన్లు ఉంటాయి. చాలామంది ఇష్టపడే రబ్బర్ టిప్స్ ఉన్న బడ్స్ చెవులకు ఎక్కువ హాని చేస్తాయి. ఇవి చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేయడం వల్ల లోపలికి గాలి అస్సలు ఆడదు. ఇక దీనివల్ల చెవులు పొడిబారిపోయి డ్రైగా మారిపోతాయి. కాబట్టి, రబ్బర్ బడ్స్ లేని నార్మల్ ఇయర్‌ఫోన్స్ వాడటం కొంతవరకు సురక్షితం.

ఓవర్-ది-ఇయర్ హెడ్‌ఫోన్స్ బెస్ట్ చాయిస్: ఆఫీస్ పనుల వల్ల గంటల తరబడి హెడ్‌ఫోన్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటే, చెవి లోపలికి దూరిపోయే ఇయర్‌బడ్స్‌ను పక్కన పెట్టేయండి. వాటికి బదులుగా చెవిని పూర్తిగా కవర్ చేసే ‘ఓవర్-ది-ఇయర్’ హెడ్‌ఫోన్స్ వాడటం చాలా మంచిది. ఇక ఇవి చెవి రంధ్రాన్ని నేరుగా నొక్కేయకుండా, చెవి చుట్టూ ఉంటాయి కాబట్టి వీటివల్ల పెద్దగా నష్టం ఉండదు.

వాల్యూమ్ తగ్గించండి, క్లీన్‌గా ఉంచండి: పాటలు వినేటప్పుడు లేదా కాల్స్ మాట్లాడేటప్పుడు ఫుల్ వాల్యూమ్ అస్సలు పెట్టొద్దు. తక్కువ వాల్యూమ్ వల్ల చెవి లోపలి పొరలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ఇయర్‌ఫోన్స్‌ను తరచూ శానిటైజర్‌తో క్లీన్ చేస్తూ ఉండాలి. వాటిపై ఉండే చెమట, తడి వల్ల బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక సాంకేతికత మన సౌకర్యం కోసమే అయినా, అది మన ఆరోగ్యానికి శాపంగా మారకూడదు. ఇయర్‌బడ్స్ వాడకంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా మన వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు.

గమనిక: మీ చెవుల్లో ఎలాంటి అసౌకర్యం, నొప్పి లేదా వింత శబ్దాలు వినిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి, ఇయర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

The post రోజంతా ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? మీ హెల్త్‌పై ఎఫెక్ట్ ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.