July 17, 2026

Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?

Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
Reading Time: 2 minutes
Samantha Baby Shower Photos Go Viral Are The Baby Shower Pictures Real

Samantha baby shower Photos: హీరోయిన్ సమంత రూత్ ప్రభు గర్భవతి అయినా సంగంతి విదితమే.. అయితే తాజాగా సమంత, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సీమంతం (గోద్ భరాయ్) వేడుక జరుపుకున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు సీమంతం సంబంధించినవా..? కాదా..? అనేది అధికారికంగా ధృవీకరించబడలేదు.

వైరల్ అవుతున్న పోస్టుల్లో సమంత, రాజ్ నిడిమోరు మరూన్ రంగు సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకలో పాల్గొన్నట్లు కనపడుతింది. మరోవైపు సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. అయితే సమంత లేదా ఆమె ప్రతినిధులు, భర్త రాజ్ నిడిమోరు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ ఫొటోలు సీమంత కార్యక్రమానివని చెప్పలేము. గతంలో సమంత, రాజ్ నిడిమోరు మధ్య రిలేషన్‌షిప్‌పై పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంపై పెద్దగా స్పందించలేదు.

తల్లి కావాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని నటి సమంత ఇటీవల వెల్లడించింది. జీవితంలో ఈ దశ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, తల్లిగా మారడం తన హృదయానికి ఎంతో ప్రత్యేకమైన విషయం అని చెప్పింది. గర్భధారణ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అనుభవమని సమంత పేర్కొంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ వేడుకల్లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే తాను గర్భవతినని అధికారికంగా ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.

కాగా, సమంత-రాజ్ నిడిమోరు మధ్య ప్రేమ వార్తలు 2024లో మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి కనిపించడంతో రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2025లో సమంత రాజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు దీనిని వారి ప్రేమకు సంకేతంగా భావించారు. అదే ఏడాది కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో జరిగిన యోగిక్ వేడుకలో తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. సమంత, దర్శకుల ద్వయం రాజ్ & డీకేతో కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేసింది. వాటిలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (2021), ‘సిటాడెల్: హనీ బన్నీ’ (2024) వెబ్ సిరీస్‌లు ముఖమైనవి.