July 17, 2026

Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్..

Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్..
Reading Time: 2 minutes
Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్..

డ్వాక్రా లేదా పొదుపు సంఘాల గురించి అందరికీ తెలిసిందే. మహిళలు తమ ఆర్ధికాభివృద్ది కోసం ఈ సంఘాలు స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళలే ఒక గ్రూపుగా ఏర్పడి తమ సంఘాలను నిర్వహించుకోవచ్చు. తమ సంఘాన్ని ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకుంటే అనేక ప్రయోజనాలు అందుతాయి. వడ్డీ లేని రుణాలు, ఆర్ధిక తోడ్పాటు, వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి సాయం వంటివి అందుతాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో అనేక డ్వాక్రా గ్రూపులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరికి ప్రభుత్వాల నుంచి సులువుగా రుణాలతో పాటు వివిధ ప్రయోజనాలు అందుతున్నాయి. అయితే అసలు డ్వాక్రా గ్రూపు ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ప్రభుత్వ గుర్తింపు ఎలా పొందాలి? అనే విషయాలు చాలామంది మహిళలకు తెలియడం లేదు. ఆ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

డ్వాక్రా గ్రూపులో చేరాలంటే అర్హతలు ఏంటి..?

-ఏపీలో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి

-తెలంగాణలో 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి

-ఇప్పటివరకు ఏ డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉండకూడదు

-ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి

-మీ అడ్రస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే డ్వాక్రా గ్రూపులో చేరాలి

గ్రూపు ఎలా క్రియేట్ చేసుకోవాలి..?

తమ గ్రామం లేదా పట్టణంలోని 10 మంది మహిళలు కలిసి ఒక డ్వాక్రా గ్రూపును క్రియేట్ చేసుకోవాలి. దివ్యాంగులైతే ఐదుగురు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రూపుగా ఏర్పడాక సంఘం పేరును నిర్ణయించుకోవాలి. అలాగే సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి, కమిటీని ఎన్నుకోవాలి. సంఘం లక్ష్యాలు, కార్యకలాపాల గురించి ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ తీర్మానం కాపీని బ్యాంక్ మేనేజర్, ఇందిరా క్రాంతి పథకం కమ్యూనిటీ కోఆర్డినేటర్‌కు అందించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా అధికారులను సంప్రదించి తీర్మానం సమర్పించాల్సి ఉంటుంది. ఈ సంఘం పేరుపై ఉమ్మడి బ్యాంక్ అకౌంట్ తెరవాలి. బ్యాంకులో అకౌంట్ తెరిచాక అధ్యక్షరాలు, కార్యదర్శి పేరుపై బ్యాంక్ లావాదేవీలు నిర్వహించబడుతున్నాయి.

ప్రారంభం ఎంత రుణం పొందవచ్చు..?

గ్రూపులోని సభ్యులను బట్టి రుణం అందిస్తారు. ప్రారంభంలో రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈఎంఐ రూపంలో వీటిని చెల్లించవచ్చు. రుణం సకాలంలో చెల్లిస్తే ఆ తర్వాత పెద్ద మొత్తంలో రుణ సౌకర్యం పొందవచ్చు. మహిళలు వీటిని తమ ఆర్ధిక అవసరాలు, కుటుంబ అవసరాలు, స్వయం ఉపాధి పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు డ్వాక్రా గ్రూపుల వ్యవస్థను తీసుకొచ్చాయి. వీటి ద్వారా లక్షలాది మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.