July 15, 2026

AIతో లేఆఫ్స్ చేపట్టిన మెటా… కోర్టుకెళ్లిన 26 మంది ఉద్యోగులు… అంతా మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్నోళ్లే..!

AIతో లేఆఫ్స్ చేపట్టిన మెటా... కోర్టుకెళ్లిన 26 మంది ఉద్యోగులు... అంతా మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్నోళ్లే..!
Reading Time: < 1 minute

AIతో లేఆఫ్స్ చేపట్టిన మెటా… కోర్టుకెళ్లిన 26 మంది ఉద్యోగులు… అంతా మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్నోళ్లే..!

Caption of Image.

ఈ మధ్య కాలంలో లేఆఫ్స్ కామన్ అయిపోయాయి… ప్రాజెక్ట్స్ లేవనో, ఏఐ కారణంగానో… ఇలా ఏదో ఒక కారణంతో పెద్ద పెద్ద MNCలు మొదలుకొని చిన్న స్టార్టప్ కంపెనీల వరకు ప్రతి కంపెనీలో ఉద్యోగాల కోత చేపడుతున్నారు. బలవంతపు రిజిగ్నేషన్స్ తో ఉద్యోగులను ఉన్నపలంగా ఇంటికి పంపించేస్తున్నారు. మెటా సంస్థలో కూడా భారీగా లేఆఫ్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ లేఆఫ్స్ లో ఉద్యోగం కోల్పోయిన 26 మంది ఉద్యోగులు కోర్టుకెళ్లి మెటాకు ఊహించని షాకిచ్చారు.

మే నెలలో తొలగించనున్నట్లు మెటా ప్రకటించిన 8 వేల మంది ఉద్యోగులలో ఈ 26 మంది కూడా ఉన్నారు. ఎవరిని తొలగించాలో నిర్ణయించడానికి కంపెనీ ఇంటర్నల్ ఏఐ సిస్టం, కీస్ట్రోక్, ఆక్టివిటీ మానిటరింగ్ డేటా, ఏఐ టోకెన్-యూసేజ్ డాష్‌బోర్డ్‌లు, అల్గారిథమిక్‌గా సహాయపడే పనితీరు ర్యాంకింగ్‌లతో పాటు ఇతర పద్ధతులను ఉపయోగించిందని కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు 26 మంది ఉద్యోగులు.

మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్న ఉద్యోగులకు, అంగవైకల్యం కారణంగా ప్రొడక్టివిటీ తగ్గినవారికి రేటింగ్స్, ఈ స్కోర్ ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని పిటిషన్ లో పేర్కొన్నారు ఉద్యోగులు. రేటింగ్స్ ఇచ్చే సమయంలో మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.మెటా నిర్లక్ష్యం కారణంగా మెడికల్ లీవ్, పేరెంటల్ లీవ్ లో ఉన్నవారిని లేఆఫ్స్ కి ఎంపిక చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు ఉద్యోగులు.

ఎక్కువ మంది పేరెంటల్ లీవ్ లో ఉన్నవారే:

పిటిషన్ దాఖలు చేసినవారిలో ఎక్కువ మంది ప్రెగ్నెన్సీ, పేరెంటల్ లీవ్ లలో ఉన్నవారేనని… లీవ్ లో ఉన్న సమయంలో పని చేయకపోవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గిందని పేర్కొన్నారు ఉద్యోగులు. అంతే కాకుండా ఒక ఉద్యోగి హెల్త్ కండిషన్ సీరియస్ అయ్యి అంగవైకల్యానికి గురైనప్పటికీ మెడికల్ లీవ్ ఇవ్వకుండా వర్క్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు.

అయితే.. ఉద్యోగుల ఆరోపణలను ఖండించింది మెటా సంస్థ. లేఆఫ్స్ కోసం ఏఐ వాడలేదని… తమ హెచ్ఆర్ సిబ్బంది రేటింగ్స్ నిర్ణయించి లేఆఫ్స్ డిసైడ్ చేశారని పేర్కొంది మెటా.

©️ VIL Media Pvt Ltd.