టెన్త్ పాసై మ్యూజిక్ సర్టిఫికేట్ ఉందా ? IAF చేరే సువర్ణావకాశం.. పూర్తి వివరాలు ఇవే!

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ లో భాగం కావడానికి అగ్నివీర్‌వాయు (మ్యుజీషియన్) ఇన్‌టేక్ 01/2027 నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు రెండు ప్రత్యేక కేంద్రాల్లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.
పోస్టు పేరు: అగ్నివీర్ (మ్యుజీషియన్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన స్కూల్/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి ఏదైనా ఒక వాయిద్యంలో గ్రేడ్-–5 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
లేదా
హిందుస్థానీ లేదా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న అభ్యర్థులైతే డిప్లొమా లేదా తత్సమాన సర్టిఫికేట్ కలిగి ఉండాలి లేదా స్టాఫ్ నొటేషన్ పద్ధతి ఆధారంగా ఊదే వాయిద్యాలు వాయించే అభ్యర్థులైతే వివిధ సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు తెలిపే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లేదా అవార్డు పత్రాలను కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 22 ఏళ్లు. అభ్యర్థులు 2005, జనవరి 1 నుంచి 2009, జులై 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
వైవాహిక స్థితి: ఈ నియామకాలకు కేవలం అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల ఉద్యోగ కాల పరిమితిలో వివాహం చేసుకోబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 20.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 2.
ప్రీ– రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు.
మెడికల్ ఎగ్జామినేషన్: నవంబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ–I), ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ–II), ఇంగ్లిష్ రాత పరీక్ష, మ్యూజికల్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎంపీటీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ iafrecruitment.edcil.co.inను సందర్శించండి.
►ALSO READ NEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. స్టూడెంట్స్ ఇలా చెక్ చేసుకోండి