భార్యపై అనుమానంతో.. పిల్లల ముందే కారులో చంపిన భర్త…

ఈ మధ్య చంపడం చాలా ఈజీ అయిపోతోంది జనాలకు. ఏ చిన్న డిస్టబెన్స్ వచ్చినా… చంపడమే ఆప్షన్ గా తీసుకుంటున్నారు జనం. భార్యపై అనుమానంతో ముగ్గురు పిల్లల ముందు కారులోనే కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. మహారాష్ట్రలో జరిగింది ఈ దారుణం. మంగళవారం ( జులై 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లల ముందే కారులో తన భార్యను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన సల్మాన్ ఖాన్, భార్య హసీన్ బానో తమ ముగ్గురు పిల్లలతో కలిసి మహారాష్ట్రలోని నివసిస్తున్నారు. సల్మాన్ ఖాన్ భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడని చెబుతున్నారు స్థానికులు. ఈ క్రమంలో మంగళవారం భార్య, పిల్లలతో కారులో వెళ్తుండగా… భార్య హసీన్ తో గొడవపడి ఆమెను కర్రతో కొట్టి, గొంతు నులిమి చంపేసినట్లు తెలిపారు పోలీసులు.
►ALSO READ | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీం ఆగ్రహం.. రూ.10 లక్షల జరిమానా !
సల్మాన్ ఖాన్ భార్య శవంతో కారులో సిటీ మొత్తం తిరిగాడని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత కరంజా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.