July 17, 2026

పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
Reading Time: < 1 minute

పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

Caption of Image.

కోటగిరి, వెలుగు: రైతుల కోసం అహర్నిశలు పనిచేసే నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిపై ప్రతిపక్ష నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బాన్సువాడు నియోజకవర్గ కాంగ్రెస్​నాయకులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి బస్టాండ్ ప్రాంతంలో బుధవారం వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, పోతంగల్, కోటగిరి మండలాల కాంగ్రెస్​ నాయకులు మాట్లాడారు. ఎల్‌‌నినో ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉండి నీటి కొరత ఏర్పడుతోందన్నారు. 

బోర్ల వద్ద వరి నాట్లు ఎండిపోకుండా ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం గత వారం రోజులుగా అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి నిజంసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, అందుకే హైదరాబాద్​లో ఉన్నారని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, కోటగిరి, పొతంగల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బర్ల మధుకర్, షాజీ పటేల్, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.