ఒకే స్టేడియం.. ఒకే మ్యాచ్.. మాట్లాడుకోని గంభీర్, కోహ్లీ.. భారత జట్టులో మళ్లీ కోల్డ్ వార్?

Cold War Again Kohli vs Gambhir: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టులో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయా? అనే అనుమానాలు ఇప్పుడు ఫ్యాన్స్ ని తెగ వేధిస్తున్నాయి. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్స్ లో ఈ ఇద్దరు కనీసం మాట్లాడుకోలేదని వస్తున్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నెట్స్‌లో కనిపించని కెమిస్ట్రీ:
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను గంభీర్ చాలా నిశితంగా గమనించారు. కానీ నేరుగా కింగ్ కోహ్లీ దగ్గరికి వెళ్లి సలహాలు ఇవ్వకుండా, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ద్వారా సందేశాలు పంపడం గమనార్హం. ఈ సెషన్‌లో అనవసర షాట్లకు ప్రయత్నించి కోహ్లీ కొన్నిసార్లు క్లీన్ బౌల్డ్ కావడంతో, గంభీర్ స్వయంగా వెళ్లిపోకుండా.. బ్యాటింగ్ కోచ్‌కు చెప్పి కోహ్లీతో మాట్లాడించారు. ఈ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ కి సంబంధించిన వీడియో ఒక్కసారిగా నెట్టింట వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య మళ్లీ లొల్లి స్టార్ట్ అయిందనే ప్రచారం జరుగుతుంది.
గిల్, రోహిత్‌లతో మాటలు.. కోహ్లీతో మాత్రం నో టాక్స్:
ప్రాక్టీస్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌తో సుదీర్ఘంగా మాట్లాడాడు. కానీ, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో మాత్రం ఒక్కసారిగా మాట్లాడినట్లు ఎక్కడ కూడా కనిపించలేదు. అటు కోహ్లీ కూడా గంభీర్ సైడ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నిం చేయలేదు. ఈ నిశ్శబ్ద యుద్ధం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కోల్డ్ వైబ్స్ కు అద్దం పడుతోందని ఇంటర్నేషనల్ మీడియా కోడైకూస్తుంది.
ALSO READ : పైసల్ ఇస్తేనే NOC..
ఐపీఎల్ గొడవలు.. వన్డే సిరీస్‌పై ఎఫెక్ట్ పడేనా:
గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా గంభీర్, కోహ్లీల మధ్య జరిగిన గొడవలు క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేశాయి. అయితే గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఈ ఇద్దరూ ఎంతో ప్రొఫెషనల్‌గా కలిసి పని చేసినప్పటికీ, ఇరువురి మధ్య సయోధ్య మాత్రం కుదిరినపట్లు ఎక్కడ కనిపించలేదు.. ఇద్దరి మధ్య గ్యాప్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్.. వన్డే సిరీస్‌లోనైనా పుంజుకోవాలంటే కోచ్, సీనియర్ ప్లేయర్ మధ్య సమన్వయం చాలా అవసరం.. మరి ఈ సైలెంట్ వార్ ఎఫెక్ట్ వన్డే సిరీస్ పై ఏమైనా పడుతుందో లేదో చూద్దాం..
🔥 KOHLI SNUBS GAMBHI! 😤
Virat walks straight past Coach Gautam Gambhir at Edgbaston practice with ZERO interaction!
No words. No eye contact. Just cold vibes.
Meanwhile, Kohli was seen having a long chat with Shubman Gill 👀
Tension in Team India before the England ODI…
— BiswaaX (@BiswaaX) July 14, 2026