Reading Time: < 1 minute

జనగణన తర్వాతే టీచర్ల బదిలీలు ప్రమోషన్లు..టీపీటీయూ నేతలతో విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఈ విద్యాసంవత్సరంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉండదని, 2027లో జరిగే దేశవ్యాప్త జనగణన పూర్తయిన తర్వాతే వీటిని చేపడతామని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆమెను కలిసి విద్యాశాఖలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా బదిలీలు, ప్రమోషన్ల అంశంపై ఆమె స్పష్టత ఇచ్చారు. టీచర్లకు నిర్వహించే టెట్ ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ విధానంలో కాకుండా మాన్యువల్ గానే నిర్వహించాలని కోరారు. బోధించే సబ్జెక్టులకు అనుగుణంగానే టెట్ ఉండాలని, అర్హత మార్కులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలని,  స్పౌస్ బదిలీలను వెంటనే పూర్తి  చేయాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.