July 14, 2026

అడ్డగోలుగా వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇచ్చేయండి : ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..!

అడ్డగోలుగా వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇచ్చేయండి : ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..!
Reading Time: 2 minutes

అడ్డగోలుగా వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇచ్చేయండి : ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..!

Caption of Image.

చండీఘర్: విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూల్ చేస్తోన్న ప్రవేట్ స్కూళ్లపై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు ఆ అదనపు మొత్తాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఇటీవల ఫీజు చెల్లించలేదని మానసిక వేధింపుల కారణంగా అమృత్‎సర్‎లో 17ఏళ్ల విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‎లో తీవ్ర దుమారం రేపడంతో ప్రవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజు దోపిడీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

పలు ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూల్ చేస్తోన్నట్లు సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రవేట్ స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా 5 శాతానికి పైగా ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు ఆ అదనపు మొత్తాన్ని వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని ఆయన ఆదేశించారు.

విద్యాసంస్థలు లాభాపేక్ష కర్మాగారాలుగా పనిచేయడానికి ఆప్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని ఆయన తేల్చిచెప్పారు. పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్-ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2026ను ఆమోదించారని.. ఇది 2026, జులై 13 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపారు.

ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అన్ని ఫీజులు కలిపి విద్యార్థులపై విధించే వార్షిక రుసుము 5 శాతానికి మించి పెంచకూడదు. ఇకపై ఇష్టారీతిన ఫీజులు వసూల్ చేయొద్దని.. ఫీజు అంటో ఏమిటో ఆర్డినెన్స్‎లో ప్రభుత్వం స్పష్టంగా నిర్వచనం ఇచ్చిందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు గత నాలుగు సంవత్సరాల ఫీజు రికార్డులను పది రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. 

ALSO READ : CBSE టెన్త్ సర్టిఫికెట్ కావాలంటే.. 

ఆ సమాచారాన్ని విద్యాశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని.. ఈ మొత్తం ప్రక్రియ ఒక నెలలోగా పూర్తి చేయబడుతుందని తెలిపారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు జరిమానాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. వరుసగా నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపును రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.