కోరుట్ల: టీఆర్ రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాల అమ్మకం…షోరూం నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు Caption of Image.
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని పలు బైక్ షోరూముల్లో రవాణాశాఖ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే కొన్ని షోరూంలు తాత్కాలిక (టీఆర్) రిజిస్ట్రేషన్ లేకుండానే బైక్లు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన షోరూంల యాజమాన్యాలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని మొహమ్మద్ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్ రామారావు, ఎం. సాయి చరణ్ తమ సిబ్బందితో కలిసి షోరూంలను తనిఖీ చేసి వాహనాల అమ్మకాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.