July 17, 2026

జగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు

జగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు
Reading Time: < 1 minute

జగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు

Caption of Image.
  •     ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు

జగిత్యాల టౌన్, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న తమను పోషించకుండా వేధింపులకు గురిచేస్తున్న కొడుకు, కోడలిపై జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ సాయంతో ఆర్డీవో ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కోట వసంతకు ఫిర్యాదు చేయగా వారిపై సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. 

ఎండపెల్లి గ్రామానికి చెందిన బొజ్జ భూమయ్య(84), రాజమ్మ(78) అనే వృద్ధ దంపతులు విలేకరుల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము కట్టుకున్న ఇంట్లోనే చిన్న కొడుకు మహేశ్, కోడలు మమత నివసిస్తూ తమను పోషించడం లేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. వారిని తమ ఇంట్లో నుంచి వెళ్లగొట్టి తమకు పోషణ, వైద్య ఖర్చుల కింద ప్రతి నెలా కొడుకుల నుంచి రూ.10 వేలు ఇప్పించాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.