కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు క్షణాల్లో వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా కదులుతున్న రైలు బోగీలో పూజారి మంత్రోచ్చారణల మధ్య పలువురు భక్తులు హోమాలు, పూజలు నిర్వహిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణ రైలు కోచ్‌లలో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ఇలాంటి కార్యక్రమాలకు రైల్వే శాఖ ఎలా అనుమతిస్తుందంటూ నెటిజన్లు అధికారులను నిలదీశారు. గతంలో వచ్చిన ‘హనీమూన్ కోచ్’ వివాదం లాగే దీనిపై కూడా ప్రశ్నల వర్షం కురవడంతో నార్తర్న్ రైల్వే శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. రైల్వే శాఖ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్యాసింజర్ బోగీ కాదు. అది ఐఆర్‌సీటీసీ ద్వారా ఒక ప్రైవేట్ పార్టీ ప్రత్యేకంగా బుక్ చేసుకున్న విలాసవంతమైన ‘సెలూన్ కార్’. ఈ సెలూన్ కార్లలో ఏసీ బెడ్‌రూమ్‌లు, కిచెనెట్, డైనింగ్ ఏరియా వంటి అన్ని సౌకర్యాలు ఒక ప్రైవేట్ ఇల్లు లాగా ఉంటాయి. జులై 8న ఒక ప్రైవేట్ పార్టీ ఈ సెలూన్ కార్‌ను రూ. 3,08,580 చెల్లించి వన్‌వే ప్రయాణం కోసం కమర్షియల్ బుకింగ్ చేసుకుంది. జులై 10న న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్ వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రత్యేక కోచ్‌ను జత చేసినట్లు అధికారులు వివరించారు. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు, నిబంధనలకు లోబడి భారీ రుసుము చెల్లించి ఇలాంటి ప్రైవేట్ కోచ్‌లలో వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉందని రైల్వే శాఖ ఈ ఘటనతో స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్!
Vijay Deverakonda: అభిమానికి విజయ్ దేవరకొండ అభయం!
ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!